కపటధారిగా మారిన సుమంత్

ఇదంజగత్ సినిమాలో అక్కడక్కడ నెగెటివ్ షేడ్స్ లో కనిపించిన సుమంత్, ఈసారి కూడా దాదాపు అలాంటి షేడ్స్ ఉన్న పాత్రనే పోషిస్తున్నాడు.

ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్ హీరోగా చేస్తున్న సినిమాకు కటపధారి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పనిలో పనిగా ఇన్నాళ్లకు ఈ సినిమా రీమేక్ అనే విషయాన్ని కూడా బయటపెట్టారు మేకర్స్.

కన్నడలో వచ్చిన కవల్దారి సినిమాకు రీమేక్ గా ఇది వస్తోంది. నిజానికి ఇదే సినిమా ముందుగా రాజశేఖర్ దగ్గరకు వెళ్లింది. తను ఈ సినిమా చేయబోతున్నట్టు రాజశేఖర్ ప్రకటించాడు కూడా. అప్పట్లో ఫొటోలు కూడా రిలీజయ్యాయి. కానీ అంతలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అతడు తప్పుకోవడం, సుమంత్ తో స్టార్ట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ రోజు టైటిల్ ప్రకటించడంతో పాటు లోగోను కూడా రిలీజ్ చేశారు.

ఈ సినిమా కోసం కాస్త కొత్తగా తయారయ్యాడు సుమంత్. బాడీ పెంచడంతో పాటు దట్టంగా మీసాలు కూడా పెంచాడు. హైదరాబాద్, చెన్నైలో సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తిచేయబోతున్నారు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్లలోకి రాబోతున్నాడు కపటధారి. 

Show comments