సుజిత్ ను వదలని యువి

సాహో సినిమా ఫలితం తరువాత అందిరి వేళ్లూ దర్శకుడు సుజిత్ నే చూపించాయి. కేవలం సుజిత్ కారణంగానే సాహో సినిమా అవుట్ పుట్ అలా వచ్చిందని విమర్శలు వినిపించాయి. దాంతో యువి క్యాంప్ నుంచి సుజిత్ అవుట్ అన్న టాక్ వచ్చింది. సుజిత్ కు ఇక ఇప్పట్లో సినిమా దొరకడం కూడా కష్టమే అని అనుకున్నారు.

కానీ లేటెస్ట్ సమాచారం ఏమిటంటే సుజిత్ ను యువి సంస్థ వదులుకోవడం లేదు. అతగాడితో ఓ మీడియం సినిమా చేయించే ప్రయత్నాల్లో వుంది. హీరో శర్వానంద్ తో ఓ సినిమా నిర్మించాలని, దానికి సుజిత్ ను వాడుకోవాలని యువి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సుజిత్ తొలి సినిమా హీరో శర్వానంద్ నే. పైగా యువి కి శర్వానంద్ కు మాంచి అనుబంధం, సంబంధం వుంది. అందువల్ల ప్రాజెక్టు ఈజీగానే పట్టాలు ఎక్కేస్తుంది. ఎటొచ్చీ, శర్వానంద్ కు చేతిలో వున్న కమిట్ మెంట్ లు పూర్తి కావాలి.

Show comments