సుజిత్ ఏం అదృష్టం-దిల్ రాజు

దర్శకుడు సుజిత్ అంత అదృష్టవంతుడు ఎవరూ వుండరని, రాజమౌళికి ఏళ్లకు ఏళ్లు పడితే, సుజిత్ రెండో సినిమానే ఇండియా లెవెల్ భారీ సినిమా చేసాడని నిర్మాత దిల్ రాజు అన్నారు. సాహో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ, ఇంత మంది  జనం హాజరయిన తెలుగు సినిమా ఫంక్షన్ ను మళ్లీ చూస్తానో, చూడనో అన్న అనుమానం వుందని, అందుకే ఈ జనంతో ఓ సెల్ఫీ తీసుకుంటా అని ఆయన అన్నారు. వంశీ-విక్కీ-ప్రమోద్ లు ధైర్యానికి ఆశ్చర్యం వేస్తుందని, మిర్చి తీసినపుడు అంత బడ్జెట్ నా అని అడిగితే సింపుల్ గా నవ్వేసి, ప్రభాస్ కోసం అన్నారని, ఇప్పుడు మళ్లీ ఇన్ని కోట్లు పెట్టి తీస్తుంటే, అదే ప్రశ్న అడిగానని, మళ్లీ అదే సమాధానం వచ్చిందని, భారీ సినిమా తీయడం అన్నది వాళ్లను చూసి తాను నేర్చుకుంటానని దిల్ రాజు అన్నారు.

అందరికీ ప్రభాస్ నే డార్లింగ్

ప్రభాస్ కేవలం యాక్టర్ కాదని, ఆయనో స్టార్ అని, తన ఇంట్లో 88 ఏళ్ల తన తల్లి నుంచి అయిదేళ్ల తన మనవడు వరకు అందరూ ప్రభాస్ ఫ్యాన్స్ అని నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. సముద్రంలా ఇంత మంది జనం ఓ ఫంక్షన్ కు వచ్చారంటే ప్రభాస్ స్టార్ డమ్ ఎలాంటిదో తెలుస్తుందని ఆయన అన్నారు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించి, తెలుగువాడి సత్తాను దేశం మొత్తం చాటాలని అన్నారు.

ప్రభాస్ మెమరీ సూపర్-సుజిత్

ప్రభాస్ మెమరీ అద్భుతమని, ఓసారి చెప్పిన పాయింట్ ఏళ్లు అయినా గుర్తు పెట్టుకుంటారని, జస్ట్ ఓ తను చేసిన వర్క్ డివిడి ఒకటి కబరు చేసి తొలి సినిమా అవకాశం ఇచ్చారని దర్శకుడు సుజిత్ అన్నారు. సినిమా మేకింగ్ లో ఎందరో హేమా హేమీలు తనకు అండగా నిలిచారన్నారు. ప్రభాస్ అంటే ఎనర్జీ అని, ఎప్పుడు ఎనర్జీ తగ్గినా తాము ప్రభాస్ అన్న అని ఓ సారి అనుకుంటే, మళ్లీ ఫుల్ ఎనర్జీ తమకు వస్తుందని సుజిత్ అన్నారు. 

ప్రభాస్ కు దూరదృష్టి ఎక్కువ-రాజమౌళి

ప్రభాస్ కు దూరదృష్టి ఎక్కువ, బాహుబలి చేస్తున్నపుడే, తరువాత ఎలాంటి సినిమా చేయాలన్నది ఆలోచించి పెట్టుకున్నాడని దర్శకుడు రాజమౌళి అన్నారు. ప్రభాస్ లాంటి ఆల్ ఇండియా స్టార్ ను హ్యాండిల్ చేయడం అంత వీజీ కాదని, సుజిత్ అలా చేయగలగడం అన్నది గొప్ప విషయమని, వంశీ, ప్రమోద్, ప్రభాస్ ఇలా ఎందరు, ఎంత ధైర్యం చేసినా, అదంతా సుజిత్ తెచ్చిన కథ ను నమ్మే అని, అందువల్ల సినిమా క్రెడిట్ అంతా సుజిత్ దే అని రాజమౌళి అన్నారు. ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్ అన్నది ఆల్ రెడీ ప్రూవ్ అయిపోయింది, ఇప్పుడు ఈ సినిమాతో ఇంకా ఇంకా పైకి వెళ్లాడని ఆయన అన్నారు.

వంశీకి ఆ చిప్ లేదు-అరవింద్

భయం అనే చిప్ ను భగవంతుడు నిర్మాతలు వంశీకి పెట్టడం మరిచిపోయాడని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఎవరికైనా ఎత్తు నుంచి కిందకు చూస్తే భయం వేస్తుందని, అలాగే ఇంత భారీ సినిమా అంటే భయం వేస్తుందని, కానీ వంశీకి అలాంటి భయాలు లేవు అని అరవింద్ అన్నారు. ఈ సినిమా తో ప్రభాస్ రేంజ్ మరింత పెరుగుతుందని అరవింద్ అన్నారు.

Show comments