చిరంజీవి పక్కన నిల్చొని ఎంజాయ్ చేశా

చిరంజీవితో కలిసి నటించడమే గొప్పవిషయం అంటున్నాడు హీరో సుదీప్. అలాంటి నటుడితో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు పనికంటే ముందు ఆ ఫీలింగ్ ను ఎంజాయ్ చేయాలంటున్నాడు. సైరా షూట్ టైమ్ లో తను అదే పనిచేశానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాతే యాక్టింగ్ అంటున్నాడు.

"నా పాత్ర పేరు అవుకు రాజు. నరసింహారెడ్డి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పాత్ర అది. చాలా మంచిపాత్ర. నేనేకాదు, ఎవరు చేసిన ఈ పాత్ర క్లిక్ అవుతుంది. వాళ్లు నన్ను సెలక్ట్ చేసినందుకు రుణపడి ఉంటాను. చిరంజీవి పక్కన నిలబడే ఛాన్స్ దొరికింది నాకు. నా క్యారెక్టర్ పక్కనపెడితే, ఆ మూమెంట్ ను ఎంజాయ్ చేయాలి. అదే చేశాను. జీవితంలో ఇలాంటి అవకాశం ఎవరికైనా ఒక్కసారే వస్తుంది. దాన్ని ఎంజాయ్ చేయాలి."

తను నటించిన పహిల్వాన్ మూవీ ప్రమోషన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు సుదీప్. అయితే ఆ సినిమా కంటే మీడియా నుంచి ఎక్కువగా సైరాకు సంబంధించిన ప్రశ్నలే అతడికి ఎదురవుతున్నాయి. వాటన్నింటికీ ఓపిగ్గా సమాధానం చెబుతున్న సుదీప్.. అవుకు రాజు పాత్ర ఎవరు చేసినా క్లిక్ అవుతుందంటున్నాడు.

"చిరంజీవికి ఇది సరైన సినిమా. అలాంటి వ్యక్తికి ఇలాంటి క్యారెక్టర్ పడాల్సిందే. రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించడం మరో గొప్ప విషయం. ఓ తండ్రికి, కొడుకు ఇంత కంటే గొప్ప బహుమతి ఇవ్వలేడేమో. ఇక చిరంజీవి విషయానికొస్తే ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయనతో కలిసి వర్క్ చేసిన ప్రతి నిమిషం నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది."

రాజమౌళి తీసిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సుదీప్. ఆ తర్వాత రాజమౌళి తీసిన బాహుబలి సినిమాలో కూడా ఉన్నాడు. కానీ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్-ఆర్-ఆర్ సినిమాలో మాత్రం సుదీప్ కు క్యారెక్టర్ దక్కలేదు. ఈ విషయంలో కొంచెం బాధగా ఉందంటున్నాడు ఈ నటుడు.

జగన్‌ పాలన.. 'హాఫ్‌' మార్కును చేరిన అభినందనలు

Related Stories: