విశాఖలో విజయపధం..!

మహా విశాఖ నగరం మీద వైసీపీ గురి పెట్టింది. పాలనా రాజధానిని కూడా చేయాలనుకుంటోంది. విశాఖను ఆసియా ఖండంలోనే రోల్ మోడల్ సిటీగా అభివృద్ధి చేయాలన్నది వైసీపీ ఆలోచన.  

ఈ నేపధ్యంలో  వచ్చిన జీవీఎంసీ ఎన్నికలను వైసీపీ ఒక సవాల్ గా తీసుకుంది. తొంబై శాతానికి పైగా సీట్లను కైవశం చేసుకోవడం ద్వారాజెండా పాతాలన్నది వైసీపీ  టార్గెట్ గా ఉంది.

దాంతో విశాఖలో వైసీపీని గెలిపించే బాధ్యతను విజయసాయిరెడ్డి భుజానికెత్తుకున్నారు. వార్డుల వారీగా పాదయాత్రలు చేస్తూ ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. 

విజయసాయి పాదానికి వేలాది పాదాలు జత కలుస్తూ విశాఖలో అలా  సాగడం ఒక ప్రత్యేకత.  ఇక‌ స్థానిక  సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడ హామీ ఇవ్వడమే కాదు, వాటి పరిష్కారానికి టైమ్  బౌండ్ ప్రొగ్రాం ని కూడా విజయసాయిరెడ్డి ప్రకటిస్తున్నారు.

Readmore!

విశాఖలో ఈ తరహా ఎన్నికల ప్రచారం ఇదే ప్రధమం కావడం విశేషం. . మొత్తానికి విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న వైసీపీ మేయర్ పీఠం సాధిస్తామన్న గట్టి విశ్వాసంతో ఉంది.

నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ

లోకేష్‌కు  పిచ్చి పీక్స్‌కు చేరిపోయింది

Show comments