'స్టార్' లకు 'బాబు' సెటైర్ నా?

మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, ఇలా ఇంకా చాలా మంది స్టార్ లు వున్నారు మెగా ఫ్యామిలీలో. వరుణ్ తేజ్, సాయితేజ్ లకు కూడా ఇలాంటివే బిరుదులు వున్నాయి. వీటన్నింటి మీద చిన్నపాట సెటైర్ పడింది. సైరా ఫంక్షన్ లో సీనియర్ హీరో జగపతి బాబు ప్రసంగం ప్రారంభిస్తూ విసిరిన చెణకు అలాంటిది మరి. వాస్తవానికి ఆయన కావాలని అని వుండకపోవచ్చు. కానీ ఆ మాట అలా ధ్వనించింది.

స్టేజ్ మీద చాలామంది వుండడంతో, సమయం లేకపోవడంతో జగపతి బాబు మైక్ అందుకుని, మెగాస్టార్, పవర్ స్టార్, ఆల్ కైండ్ ఆఫ్ గిగా స్టార్స్ ఆన్ ది స్టేజ్' అంటూ ప్రసంగం ప్రారంభించారు. హడావుడిగా ఆయన అన్న ఆ మాటలు అంతా అట్రాక్షన్ కు దారి తీయలేదు కానీ, ఆడ్ గా వున్నాయన్న కామెంట్లు వినిపించాయి.

ఎంతమంది హీరోలు వచ్చినా తప్పు లేదు కానీ, మొదటి సినిమా నుంచే మెగా హీరోల సముదాయం అని స్ఫురించేలా, అప్పటికి వున్న బిరుదులకు మ్యాచ్ అయ్యేలా ఏదో ఒకటి కొత్తగా ఫిక్స్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇదంతా ఫ్యాన్స్ వ్యవహారం కాబట్టి పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఇఫ్పుడు జగపతి బాబు మాట వినగానే ఇవన్నీ జనాలకు గుర్తు వచ్చి, 'ఆల్ కైండ్ ఆఫ్ గిగా స్టార్స్' అనే ఓ సెటైరికల్ వర్డ్ లా అనిపిస్తుంది.

సినీ ఇండస్ట్రీలో ఈ ఫీలింగ్స్‌ మరింత ఎక్కువ

Show comments