పవన్ ఊపిరి పీల్చుకో.. శ్రీరెడ్డి ఓపెన్ వార్నింగ్

శ్రీశక్తి పేరిట కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా తనకుతానుగా యుద్ధం ప్రకటించుకున్న శ్రీరెడ్డి, పవన్ కల్యాణ్ ను మరోసారి టార్గెట్ చేసింది. రీసెంట్ గా పవన్ పై తను విమర్శలు తగ్గించిన మాట వాస్తవమేనని, అలా అని పవన్ ను పూర్తిగా వదిలేది లేదని స్పష్టంచేసింది.

"పవన్ కు ఇంకాస్త టైం ఉంది. అతడిపై పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతాను. ఎవర్నీ వదిలిపెట్టేది లేదు. నా శపథం నెరవేర్చుకుంటాను. పవన్ ను ఆయన స్థానంలోనే ఓడిద్దాం. ఆయన ఎక్కడ నామినేషన్ వేస్తారో చూసి అక్కడే ఓడిద్దాం."

ఇలా పవన్ కు మరోసారి హెచ్చరిక జారీచేసింది శ్రీరెడ్డి. అతను ఎక్కడ నామినేషన్ వేసినప్పటికీ, ఆ స్థానంలో అతడ్ని ఓడించడానికి శాయాశక్తుల కృషిచేస్తానని ప్రకటించింది శ్రీరెడ్డి. తెలుగు ఇండస్ట్రీకి తను దూరమైపోలేదని, జస్ట్ చిన్న గ్యాప్ ఇచ్చానని తెలిపిన శ్రీరెడ్డి.. పెళ్లిపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.

"పెళ్లిపై నాకు సదభిప్రాయం లేదు.. నేను పెళ్లి చేసుకోను. ఎవరితో రిలేషన్ షిప్ కూడా పెట్టుకోను. నాకు ఈ జీవితం కాదు. నేను ప్రజల కోసమే పుట్టాను. సంఘసేవ చేసుకుంటాను." టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై కూడా స్పందించింది శ్రీరెడ్డి. ఈ కేసు విషయంలో కేసీఆర్ సర్కార్ ను, కేటీఆర్ తీరును విమర్శించింది. డ్రగ్స్ కేసుతో పాటు పార్క్ హయత్ రాసలీలల విషయంలో కేటీఆర్ వ్యవహారశైలి తనకు నచ్చలేదంటోంది శ్రీరెడ్డి.

"టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎందుకు మూసేశారు. ఒకవేళ అది క్లోజ్ అవ్వకపోతే అప్ డేట్స్ ఏంటి. ఎవరు సప్లయ్ చేస్తున్నారు. ఎవరు వాడుతున్నారు. ఆ వివరాలు మీకు తెలియదా. మీరు ఐటీమంత్రి. నేను ఏదైనా నిజం మాట్లాడితే, మీ ఐటీ యంత్రాంగాన్ని ఉపయోగించి సోషల్ మీడియాలో నా జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తారు. పార్క్ హయత్ రాసలీలల్ని మీరెందుకు సీరియస్ గా తీసుకోరు. అప్పటి రాసలీలల్లో పేర్లన్నీ నాకు తెలుసు."

పార్క్ హయత్ రాసలీలల్ని బయటపెడితే తనను హైదరాబాద్ రానివ్వరని, హైదరాబాద్ లో ఉన్న ఇంటిని కూడా తనకు దక్కకుండా చేస్తారనే భయాన్ని వ్యక్తంచేసింది శ్రీరెడ్డి.

సుజనా ఏమార్చేది ఇలాగేనా చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments