శ్రీరెడ్డి దగ్గర 'మా' లోగుట్టు... అంతా తోడుదొంగలే

మొన్నటివరకు కాస్టింగ్ కౌచ్ బేస్ చేసుకొని రోజుకో విమర్శ చేసిన శ్రీరెడ్డి ఈసారి మా అసోసియేషన్ లో వివాదాన్ని కూడా తనవైపు లాక్కునే ప్రయత్నం చేసింది. కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి తన వద్ద చాలామంది రాసలీలల ఫొటోలు, వీడియోలు ఉన్నాయని చెప్పుకున్న శ్రీరెడ్డి, ఇప్పుడు 'మా'లో లొసుగులకు సంబంధించి కూడా తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పడం విడ్డూరం. 

"నన్ను పబ్లిసిటీ స్టంట్ అన్న శివాజీరాజాకి, శ్రీకాంత్ కు గోచి ఊడి దరిద్రపు గతిపట్టింది. మోసపోయి నేనొస్తే ఓదార్చాల్సింది పోయి బడా ఫ్యామిలీస్ ను కాపాడే ప్రయత్నం చేశారు. నాకు కోట్ల రూపాయలు ఇవ్వాలని, శివాజీ రాజా అతడి తోపులు ప్రయత్నం చేస్తే, కడుపుమండి నేను తీసుకోలేదు. ఆడపిల్ల ఏడుపు ఊరికే పోదు."

ఇలా శివాజీరాజాపై ఓ రేంజ్ లో విరుచుకుపడింది శ్రీరెడ్డి. వృద్ధాశ్రమం పేరిట చిందులేసి, వచ్చిన డబ్బును వీళ్లంతా పంచుకున్నారని, ఆ సమాచారం మొత్తం తన దగ్గర ఉందని అంటోంది శ్రీరెడ్డి. "తూ.. అబద్ధాలు. అందరూ తోడుదొంగలే. డబ్బంతా పంచుకుతిన్నారు. దీంట్లో బడా హీరో వాటా చాలా పెద్ద మొత్తం. అమెరికా నుంచి మొత్తం సమాచారం నాకు వచ్చింది."

కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి అభిరామ్ ఫొటోలు తప్ప, మిగతా ఎవరి ఫొటోలు/వీడియోలు బయటపెట్టని శ్రీరెడ్డి.. కనీసం మా అసోసియేషన్ వివాదానికి సంబంధించైనా తనదగ్గరున్న సమాచారాన్ని బయటపెడుతుందేమో చూడాలి. మా అసోసియేషన్ కు సంబంధించి ఇప్పటికే టాలీవుడ్ లో నటులు, టెక్నీషియన్లంతా రెండు గ్రూపులుగా విడిపోతే.. శ్రీరెడ్డి నరేష్ వర్గాన్ని సమర్థిస్తూ పోస్ట్ పెట్టింది.

రాబోయే రోజుల్లో ''మా''కు సంబంధించి మరిన్ని లొసుగులు బయటపెడతానంటున్న శ్రీరెడ్డి, ఇప్పటికైనా అసోసియేషన్ లో జరుగుతున్న అరాచకాలకు సంబంధించి పెద్దలు స్పందించాలని, ప్రభుత్వం దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. చూస్తుంటే.. కాస్టింగ్ కౌచ్ అంశాన్ని వదిలేసి ''మా'' వివాదాన్ని శ్రీరెడ్డి హైలెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

RELATED మామ, బేబి మధ్యలో నేను