బీసీసీఐ చరిత్రలో తొలిసారి!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏర్పడి ఇప్పటికే ఆరు దశాబ్దాలు దాటాయి. అయితే ఇంతవరకూ ఆ క్రికెట్ పాలక మండలికి చరిత్రలో ఎన్నడూ ఒక్క క్రికెటర్ కూడా అధ్యక్షుడిగా కాలేదు. ఎంతసేపూ మహారాజాలు, లాబీయిస్టులు, రాజకీయ నేతలు బీసీసీఐని శాసిస్తూ వచ్చారు. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన క్రీడా బోర్డుల్లో బీసీసీఐ ఒకటి. దానిపై ఆధిపత్యం కోసం అలాంటి వాళ్లంతా పోటీ పడ్డారు.

అయితే తొలిసారి ఒక క్రికెటర్ బీసీసీఐ అధ్యక్షుడు అయ్యాడు. ఇంత వరకూ క్రికెటర్లు ఎవరూ బీసీసీఐ అధ్యక్ష స్థానాన్ని అధిష్టించని నేపథ్యంలో తొలిసారి ఆ బాద్యతలను తీసుకున్నాడు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ చండీదాస్ గంగూలీ మహరాజ్. కెప్టెన్ గా గంగూలీ భారత క్రికెట్ గతిని మార్చాడు.

స్ట్రైట్ ఫార్వర్డ్, కఠిన నిర్ణయాలకు, సాహసోపేత చర్యలకు ఏమాత్రం వెనుకాడని తత్వం గంగూలీది. రెండేళ్ల నుంచి కోర్టు నియమిత పాలకమండలి చేతుల్లో ఉండిన బీసీసీఐ ఇప్పుడు గంగూలీ చేతికి వచ్చింది. తను బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి, బెంగాల్ లో బీజేపీ రాజకీయాలకూ ఎలాంటి సంబందం లేదని సౌరవ్ తేల్చి చెప్పాడు.

మమతా బెనర్జీకి కూడా ధన్యవాదాలు చెప్పాడు సౌరవ్. ఇలా తనకు బీజేపీతో లాలూచీలు లేవని తేల్చిచెప్పాడు. రంజీ ఆటగాళ్ల జీతభత్యాలు పెంచబోతున్నట్టుగా సౌరవ్ ప్రకటించాడు. ఇది యంగ్ క్రికెటర్లలో ఉత్సాహాన్ని ఇచ్చేఅంశమే. అలాగే బీసీసీఐలో సంస్కరించాల్సిన అంశాలు ఉన్నాయని, వాటిపైనే తన దృష్టి అని నూతన బీసీసీఐ అధ్యక్షుడు ప్రకటించారు.

జగన్ పై జేసీ కోపం.. రీజన్ అదే!

Show comments