సీతపైనే ఆశలు పెట్టుకున్న సోనూసూద్

ఆగడు సినిమా ఎఫెక్ట్ మహేష్, శ్రీనువైట్ల పైనే కాదు, ఆ సినిమాలో విలన్ గా నటించిన సోనూ సూద్ పై కూడా పడింది. ఆ సినిమా దెబ్బకు సోనూసూద్ కు కూడా తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ ఇచ్చి అభినేత్రి సినిమా చేసినప్పటికీ సోనూకు అది ఏమాత్రం కలిసిరాలేదు. కట్ చేస్తే ఇప్పుడు తన ఆశలన్నీ సీత సినిమాపైనే పెట్టుకున్నాడు ఈ నటుడు.

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మరోసారి తెలుగుతెరపైకి వస్తున్నాడు సోనూ సూద్. తేజ దర్శకత్వంలో వస్తున్న సీత సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఆగడు తర్వాత ఫుల్ లెంగ్త్ విలన్ గా సోనూసూద్ నటిస్తున్న సినిమా ఇదే. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో చక్రం తిప్పాలని భావిస్తున్నాడు.

కెరీర్ పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఇప్పుడు కాస్త ఇబ్బందులో ఉన్నాడు సోనూ సూద్. అభినేత్రి ప్రాజెక్టులో డబ్బులు పెట్టి నష్టపోయాడు. సొంత బ్యానర్ లో పంజాబీలో ఓ సినిమా తీసి నష్టపోయాడు. దీనికి తోడు గతంలో ఓ ఏడాది మొత్తం ఒక హాలీవుడ్ సినిమాకు కాల్షీట్లు కేటాయించి చాలా అవకాశాలు కోల్పోయాడు. ఇలాంటి టైమ్ లో సీత సినిమా ఆఫర్ వచ్చింది.

విలన్ పాత్రల్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దే తేజ, సీత సినిమాలో సోనూసూద్ పాత్రను హీరోతో సమానంగా మలిచాడని టాక్. సీత (కాజల్) కోసం హీరో-విలన్ హోరాహోరీగా పోరాడతారట. 

నాకు ఆవిడంటే చాలా ఇష్టం : వీరమాచినేని 

నాకు స్టామినా చాలా ఎక్కువ

Show comments