సోమిరెడ్డి కూడా అజ్ఞాతంలో..!

తెలుగుదేశం నేతలు ఎక్కడ? అంటే.. పరారీలో అన్నట్టుగా మారింది పరిస్థితి. ఒకరు  కాదు ఇద్దరుకాదు.. గత మూడు నెలల్లో అనేకమంది నేతలు పరారీ మంత్రాన్ని పఠిస్తూ ఉన్నారు. ఈ జాబితా క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ జాబితాలోకి మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా చేరడం గమనార్హం.

కోడెల సంతానం, యరపతినేని, చింతమనేని వంటి వారికి తోడు.. ఇప్పుడు సోమిరెడ్డి కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తూ ఉంది. సోమిరెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్టుగా సమాచారం. గతంలో అంతర్జాతీయ స్థాయి వ్యవహారాలను కూడా జగన్ కు ముడిపెడుతూ మాట్లాడిన సోమిరెడ్డి.. ఇప్పుడు ఒక భూదందాలో చిక్కుకున్నారట.

ఎవరిదో అయిన భూమిని తనదిగా చెప్పుకుని సోమిరెడ్డి అమ్ముకున్నట్టుగా సమాచారం. దీంతో సదరు భూ ఓనర్లు సోమిరెడ్డిపై కేసులు పెట్టారు. ఇన్నిరోజులూ అలాంటివి ఏవీ విచారణకే రాలేదట, అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో సోమిరెడ్డి భూదందా వ్యవహారంపై కూడా విచారణ మొదలైంది. విచారణకు హాజరుకావాలని సోమిరెడ్డికి ఇప్పటికే సమన్లు జారీ అయినట్టుగా సమాచారం.

అయితే సోమిరెడ్డి మాత్రం విచారణకు హాజరు కావడంలేదని తెలుస్తోంది. తను అజ్ఞాతంలోకి వెళ్లి.. తన లాయర్లను ఆయన పంపించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి గతంలో ఒక రేంజ్ లో మాట్లాడిన సోమిరెడ్డి ఇప్పుడు అజ్ఞాతంలోకి జారుకోవడం ఆసక్తిదాయకమైన రాజకీయ పరిణామం అని అంటున్నారు పరిశీలకులు.

అదొక్కటే.. జగన్ తప్పుడు నిర్ణయం

Related Stories: