సోషల్ మీడియా ‘పచ్చ’పురుగులకు హెచ్చరిక

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్ర ప్రభుత్వం మీద పని గట్టుకుని కుట్రపూరితంగా దుష్ప్రచారం సాగించే వారిని వదిలిపెట్టేది లేదని రాష్ట్ర డిజిటల్ డైరెక్టర్‌గా నియమితులైన గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లను అనుచితంగా అసభ్యమైన భాషలో దూషించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన శేఖర్ చౌదరి అనే పెయిడ్ ఆర్టిస్ట్ ఆర్టిస్టును పోలీసులకు పట్టిచ్చిన సందర్భంగా దేవేందర్ రెడ్డి కొన్ని వివరాలు తెలియజేశారు.

రాష్ట్రంలో ఎవరైనా సరే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి సోషల్ మీడియా వేదికగా చేసుకొని కుట్రలు పన్నితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. అబద్ధపు ప్రచారాలు మాటలతో ప్రభుత్వం మీద బురదచల్లుతూ కూర్చుంటే సహించబోమని అన్నారు. గతంలో కూడా పసుపులేటి రమేష్ అనే వ్యక్తి ఇలాంటి దుర్మార్గాలకు, తప్పుడు ప్రచారాలకు పాల్పడినప్పుడు అతన్ని పోలీసులకు పట్టిచ్చామని గుర్తుచేశారు.

గుర్రంపాటి దేవేందర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌ కూడా. సోషల్ మీడియాను ఆలంబనగా చేసుకుని పార్టీని క్షేత్రస్థాయి వరకు బలోపేతం చేయడానికి ఆయన తనవంతు కృషి చేశారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సేవలను గుర్తించి దేవేందర్ రెడ్డికి రాష్ట్ర డిజిటల్ డైరెక్టర్ పదవి అప్పజెప్పారు.

గతంలో జగన్‌కు వ్యతిరేకంగా దుర్మార్గమైన పోస్టులు పెట్టే అనేక మందిపై ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా వాటిని అరికట్ట గలిగానని, ఇప్పుడు కూడా రాష్ట్ర డిజిటల్ డైరెక్టర్ హోదాలో మరింత సమర్థంగా పనిచేసి ఎవరు ఎలాంటి తప్పుడు ప్రచారానికి దిగిన నిమిషాల్లో పట్టుకుంటామని చెప్పారు.

పోలీసుశాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే అరాచక ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. సమర్థులను గుర్తించి వారికి తగిన పదవులు కట్టబెట్టి, వారి సేవలను ప్రభుత్వానికి వాడుకుంటారని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి గుర్తింపు ఉంది. ఇప్పుడు గుర్రంపాటి దేవేంద్రరెడ్డిని చీఫ్ డిజిటల్ డైరెక్టర్‌గా నియమించడం ద్వారా కూడా అదే నిరూపణ అవుతోంది.

ఏపీ రాజధానిని వైఎస్ జగన్ మారుస్తారా?