షకీలా, పూజాభట్ మధ్య సిగరెట్ కనెక్షన్

సౌత్ కు చెందిన షకీలాకు, నార్త్ కు చెందిన పూజా భట్ కు ఎలాంటి కనెక్షన్ లేదని చాలామంది అనుకుంటున్నారు. కానీ వీళ్లిద్దరి మధ్య సిగరెట్ కనెక్షన్ ఉంది. ఈ విషయాన్ని షకీలా స్వయంగా బయటపెట్టింది. ఊహ తెలిసినప్పట్నుంచి బోల్డ్ గానే ఉంటున్న తనకు, పూజా భట్ సిగరెట్ అలవాటు చేసిందనే విషయాన్ని షకీలా బయటపెట్టింది.

"సిగరెట్ తాగడాన్ని ఓ స్టయిల్ లా స్టార్ట్ చేశాను. ఇప్పుడు వదల్లేకపోతున్నాను. ఆర్టిస్ట్ పూజాభట్ ఓసారి షూటింగ్ కోసం చెన్నై వచ్చారు. అప్పుడు ఆమె సిగరెట్ తాగుతుంటే చూశాను. చాలా స్టయిల్ గా ఉందని అనుకున్నాను. నన్ను చూసి పూజా భట్ పిలిచింది. తాగమని చెప్పి సిగరెట్ ఇచ్చింది. అలా నాకు సిగరెట్ అంటుకుంది. ఇప్పుడు కూడా మానేయాలని అనుకుంటున్నాను. కానీ మానేయడం నావల్ల కావడం లేదు."

పూజా భట్ అలవాటు చేసిన సిగరెట్ ను ఇప్పటికీ మానేయలేకపోతున్నానని వెల్లడించింది షకీలా. అలా దాదాపు 30 ఏళ్లుగా సిగరెట్ తాగుతూనే ఉన్నానని స్పష్టంచేసింది. మరోవైపు పెళ్లిపై కూడా అంతే బోల్డ్ గా రియాక్ట్ అయింది. తన లైఫ్ లో చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, కానీ ఎవ్వర్నీ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదంటోంది.

"30ల్లో ఒకర్ని లవ్ చేశాను. కొన్ని కమర్షియల్ సినిమాలు చేసిన తర్వాత అతడ్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. అప్పుడు అమ్మ మీద కోపంతో ఆ తర్వాత కొన్ని సంబంధాలు వచ్చినా రిజెక్ట్ చేశాను. ఆ తర్వాత పూర్తిగా పెళ్లి గురించి ఆలోచించడం మానేశాను. పెళ్లి చేసుకుంటే నా ప్రైవసీ పోతుంది. ఏం చేయాలన్నా భర్త్ దగ్గర అనుమతి తీసుకోవాలి. ఒక దశలో నా బాయ్ ఫ్రెండ్సే నన్ను కట్టడిచేయడం స్టార్ట్ చేశారు. ఇక పెళ్లి చేసుకుంటే ఇంకెన్ని ఆంక్షలు పెడతారోనని చేసుకోలేదు."

పెళ్లి చేసుకుంటే విడాకులు గ్యారెంటీ అనే విషయం తనకు తెలుసని, అందుకే సింగిల్ గానే ఉండిపోయానంటోంది షకీలా. తన లైఫ్ లో 7-8 మందిని ఇష్టపడ్డానని, కానీ వాళ్లను పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయం పూర్తిగా తనదే అంటున్న షకీలా.. ఇప్పటికి ఆ 8 మంది తన కుటుంబాలతో పాటు తన ఇంటికి వస్తుంటారని వెల్లడించారు. వాళ్ల పేర్లు మాత్రం బయటపెట్టలేదు.

ఆర్టీసీ సమ్మె తో కేసీఆర్ పతనం మొదలైందా?