భూ కేటాయింపు.. ఆంధ్రజ్యోతికి కోర్టులో చుక్కెదురు!

ఆమోదా పబ్లికేషన్ కు కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం నలబై లక్షల రూపాయలకు అత్యంత చవకగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేటాయించిన వైనం ప్రభుత్వ చర్యలకు కోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆ భూ కేటాయింపును రద్దు చేయడానికి మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఆంధ్రజ్యోతి వెంటనే కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వాదనలు కూడా జరిగాయి.

కోర్టు స్పందిస్తూ.. ఆ భూమిని ఖాళీ చేయించాలనుకుంటే చట్టపరంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఇప్పటి వరకూ ఖాళీ చేయమని ఎలాంటి నోటీసులూ రాలేదని ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. నోటీసులు వచ్చాకా మరో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు విచారణ ఎందుకని కోర్టు ప్రశ్నించింది.

ఒకవేళ ప్రభుత్వం ఆ భూమిని వెనక్కు తీసుకోవాలనుకుంటే అందుకు చట్టపరంగానే ముందుకు వెళ్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు స్పష్టత ఇచ్చారు. మొత్తానికి ప్రెస్ రిలీజ్ కే బెంబెలెత్తిపోయి ఆంధ్రజ్యోతి కోర్టును ఆశ్రయించింది. చట్టపరంగా వెళ్లమని కోర్టు ప్రభుత్వానికి చెప్పింది. కాబట్టి ఇక 'చట్టం పని తను చేసుకుపోవచ్చు'!

నేను డైరెక్టర్.. తమ్ముళ్లు ఒకడు హీరో.. మరోడు ప్రొడ్యూసర్

Show comments