సర్వేః వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం!

సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) వారు ఏపీ రాజకీయ పరిస్థితి పై చేసిన సర్వే ఆసక్తిదాయకంగా మారింది. ఆ సంస్థ చేసిన ఈ సుదీర్ఘ అధ్యయన ఫలితాలు మరింత ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ఏపీలో రాజకీయ పరిస్థితిపై కూలంకషంగా చేసిన ఈ అధ్యయనం ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని అంచనా వేస్తూ ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేడో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ మధ్యన చేసిన ఈ అధ్యయనం లో వైఎస్సార్ కాంగ్రెస్ సంచలన విజయాన్ని నమోదు చేస్తుందని తేలింది.

దీని అంచనా ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 122 ఎమ్మెల్యే సీట్లను నెగ్గే అవకాశం ఉంది.  తెలుగుదేశం పార్టీ 53 ఎమ్మెల్యే సీట్లకు పరిమితం అవుతుందని ఈ సర్వే అంచనా వేసింది.  ఇక జనసేన ఒక్క ఎమ్మెల్యే సీటును  కూడా నెగ్గే పరిస్థితి లేదని ఈ సర్వే అంచనా వేయడం విశేషం. అలాగే కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ.. ఇతరులు కానీ.. ఎవ్వరూ ఎమ్మెల్యేలుగా నెగ్గే అవకాశాలు లేవని ఈ సర్వే తేల్చేసింది.

సర్వే సాగింది ఇలా...
సమాజంలోని వివిధ విభిన్న వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుని తాము ఈ అధ్యయనాన్ని చేపట్టినట్టుగా సీపీఎస్ ప్రకటించింది. పాతిక శాతం మంది కార్మికుల, ఇరవై ఒక్క శాతం రైతుల, వ్యాపారస్తుల అభిప్రాయాలు  ఇరవై శాతం,గృహిణుల అభిప్రాయాలు ఏడు శాతం, ప్రభుత్వ ఉద్యోగుల అభిప్రాయాలు ఏడు శాతం, విద్యార్థుల ఆరు శాతం, నిరుద్యోగుల నుంచి నాలుగు శాతం... ఇతరుల నుంచి మిగిలిన శాతాల అభిప్రాయాలు తీసుకుని ఈ సర్వేను పూరించినట్టుగా ఆ సంస్థ తెలిపింది. ఓటర్ల వయసు విషయంలో కూడా విభిన్న వయసుల వారి నుంచి అభిప్రాయాలను తీసుకున్నట్టుగా ఈ సర్వేయర్లు వివరించారు.

సర్వే ఫలితాలు ఇలా...
ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత గణనీయంగా ఉందని ఈ అధ్యయనం తేల్చింది. ఏకంగా యాభై పాయింట్ నాలుగు శాతం మంది ప్రభుత్వ వ్యతిరేకతను వ్యక్తం చేశారని, నలభై ఏడు శాతం మంది మాత్రం ప్రభుత్వ పనితీరు పట్ల సానుకూలంగా ఉన్నారని ఈ అధ్యయనం పేర్కొంది.

ఓట్ల శాతం నంబర్లు ఇలా..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ –47.8
టీడీపీ-43.3
జనసేన-4.6
బీజేపీ-1.9
కాంగ్రెస్-1.7
సీపీఐ-0.3
సీపీఎం-0.2
ఇతరులు-0.2

సీట్ల నంబర్లు ఇలా...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -122
తెలుగుదేశం పార్టీ -53
జనసేన- 00
కాంగ్రెస్-00
బీజేపీ-00
ఇతరులు-00

జిల్లాల వారీగా ఫలితాలు ఇలా...
శ్రీకాకుళం(10)-  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-07, టీడీపీ -03
విజయనగరం(09)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-06,టీడీపీ-03
విశాఖపట్టణం(15)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-09,టీడీపీ-06
తూర్పుగోదావరి(19)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-09,టీడీపీ-10
పశ్చిమగోదావరి(15)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-09,టీడీపీ-06
కృష్ణా(16)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-07,టీడీపీ-09
గుంటూరు(17)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-12,టీడీపీ-05
నెల్లూరు(10)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-08,టీడీపీ-02
ప్రకాశం(12)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-12,టీడీపీ-00
కర్నూలు(14)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-12,టీడీపీ-02
కడప(10)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-10,టీడీపీ-00
అనంతపురం(14)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-10,టీడీపీ-04
చిత్తూరు(14)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-11,టీడీపీ-03

ఆసక్తిదాయకమైన పరిశీలనలు ఇవి..
-జనసేన ఎక్కడా ఒక్క ఎమ్మెల్యే సీటును నెగ్గే పరిస్థితి లేకపోయినా.. రాజకీయ ప్రభావాన్ని అయితే చూపుతుంది. ప్రత్యేకించి కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన గణనీయంగా ఓట్లను పొందుతుంది. అవి ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. ఈ జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు దాదాపు సమాన స్థాయిలో సీట్లను సాధించే అవకాశాలున్నాయి.

-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ౧౧౧ ఎమ్మెల్యే సీట్లను నెగ్గే అవకాశాలున్నా, వీటిల్లో ౧౧ సీట్లలో అత్యంత గట్టి పోటీ ఉంటుంది. ఈ సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీల మధ్యన ఓట్ల శాతంలో తేడా అతి స్వల్పంగా ఉండబోతోంది. ఈ సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా కష్టపడకపోతే వీటిని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ సీట్ల జాబితా ఇలా ఉంది.
-పాతపట్నం 
-పాలకొండ
-పార్వతీపురం
-సాలూరు
-మాడుగుల
-పాయకరావుపేట
-పత్తిపాడు
-కొత్తపేట
-జగయ్యపేట
-తెనాలి
-ప్రత్తిపాడు(ఎస్సీ)
-సంతనూతలపాడు(ఎస్సీ)
-కొండెపి
-కోడూరు
-ఆళ్లగడ్డ
-నంద్యాల
-మదనపల్లె
-తిరుపతి
-శ్రీకాళహస్తి

తెలుగుదేశం పార్టీ యాభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉన్నా.. వాటిల్లో పద్దెనిమిది సీట్లలో చాలా క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ  కన్నా ఆ సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు శాతం ఓట్ల తేడాతో వెనుకబడి ఉంటుంది. వీటిల్లో ఖాయంగా నెగ్గాలనుకుంటే.. తెలుగుదేశం పార్టీ చెమటోడ్చక తప్పదు!

ఆ సీట్ల జాబితా ఇలా ఉంది..

-పాలస
-విజయనగరం
-విశాఖపట్టణం ఈస్ట్
-విశాఖపట్టణం వెస్ట్
-రాజోలు
-గన్నవరం
-మండపేట
-రాజానగరం
-రాజమండ్రి రూరల్
-దెందులూరు
-విజయవాడ వెస్ట్
-విజయవాడ సెంట్రల్
-నందిగామ
-పొన్నూరు
-హిందూపురం
-పెనుకొండ
-తంబళ్లపల్లె
-చిత్తూరు

ఒకవేళ వైఎస్సార్సీపీ జనసేనలు చేతులు కలిపితే- మొత్తం నూటా పంతొమ్మిది స్థానాలను వీరు సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. ఒకవేళ జనసేన వెళ్లి టీడీపీతో చేతులు కలిపితే ఆ పార్టీలు ఉమ్మడిగా యాభై రెండు ఎమ్మెల్యే సీట్లకు పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. అప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం నూటా ఇరవై మూడు సీట్లకు పెరుగుతుంది.

లోక్ సభ సీట్ల  ఫలితాలు ఇలా...
ఏపీలో ఉన్న పాతిక లోక్ సభ సీట్ల విషయంలో కూడా ఈ సర్వే తన అంచనాలను వెలువరించింది. వాటి ప్రకారం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఎంపీ సీట్లను నెగ్గే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఐదు ఎంపీ సీట్లను  నెగ్గే అవకాశాలున్నాయి. కాకినాడ, నరసాపురం,శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్టణం.. ఈ ఐదు ఎంపీ సీట్లను మాత్రమే తెలుగుదేశం పార్టీ నెగ్గే అవకాశాలున్నాయి. మిగిలిన అన్ని ఎంపీ సీట్లనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  సొంతం చేసుకునే అవకాశాలున్నాయి.

ఈ సర్వే కోసం తీసుకున్న మొత్తం శాంపిల్స్ సంఖ్య –4,37,642

ఇక కడపజిల్లా విషయానికి వస్తే గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది అసెంబ్లీ సీట్లను సాధించింది. తెలుగుదేశం పార్టీ నామమాత్రంగా ఒక్క సీటును నెగ్గింది. ఆ ఎమ్మెల్యే కూడా ఇటీవల జగన్ పార్టీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాలోనూ జగన్ పార్టీ స్వీప్ చేస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. పదింటికి పది సీట్లను సొంతం చేసుకుని సంపూర్ణ ఆధిపత్యాన్ని జగన్ పార్టీ ప్రదర్శించే అవకాశాలున్నాయని ఈ సర్వే అభిప్రాయపడింది.

కృష్ణాలో తొమ్మిది, వెస్ట్ గోదావరిలో పది.. ఈ రెండు జిల్లాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లను సాధిస్తుందని, అయితే అక్కడ కూడా బాగా కష్టపడితేనే కొన్ని సీట్లను ఆ పార్టీ నెగ్గే అవకాశం ఉందని ఈ సర్వే పేర్కొంది. నెల్లూరు వంటి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి ఆధిపత్యం ప్రదర్శిస్తుందని ఈ సర్వే అంచనా వేసింది.

టిడిపియే కాదు, వైసిపి కూడా యీ సత్యం గుర్తించాలి

 వైయస్‌ పాలించినది వైసిపి పార్టీ అధినేతగా కాదు

Show comments