రెండోదశ పోలింగ్.. ఎక్కడెక్కడంటే!

-లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ కు సర్వం సిద్ధం అవుతోంది. నిన్నటితో రెండోదశ పోలింగ్ కు సంబంధించిన ప్రాంతంలో ప్రచారానికి తెరపడింది. రేపు పోలింగ్ జరగనుంది.

-రెండోదశ పోలింగ్ తో దక్షిణాదిలో చాలావరకూ పోలింగ్ ప్రక్రియ పూర్తికానుంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో అన్ని ఎంపీ సీట్లకూ పోలింగ్ పూర్తైన సంగతి తెలిసిందే.

-రేపటి పోలింగ్ లో కర్ణాటకలో 14 ఎంపీ సీట్లకు ఓటింగ్ ప్రక్రియ పూర్తికానుంది. దాంతోపాటు తమిళనాట ముప్పై 39 ఎంపీ సీట్లకు రేపు పోలింగ్ పూర్తికానుంది. పాండిచ్చేరిలోని ఒక ఎంపీ సీటుకూ రేపే పోలింగ్ పూర్తికానుంది.

-మిగతా వాటి విషయానికి వస్తే జమ్మూ కశ్మీర్ లో రెండు స్థానాలకూ, బిహార్ ఐదు, యూపీ ఎనిమిది, చత్తీస్ గడ్ మూడు, మహరాష్ట్ర పది, ఒడిశా ఐదు, మణిపుర్, త్రిపురల్లో ఒక్కో స్థానానికి, పశ్చిమ బెంగాల్ లో మూడు ఎంపీ సీట్లకు రేపు పోలింగ్ జరగనుంది.

-స్థూలంగా రెండో విడతలో 97 స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తికానుంది.

-రెండో దఫాలో పోలింగ్ జరిగే ప్రాంతాలు కాంగ్రెస్ కూటమికి అత్యంత కీలకమైనవి. తమిళనాట డీఎంకేతో కలిసి, కర్ణాటకలో జేడీఎస్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీచేస్తూ ఉంది. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంతంగా ఎన్ని సీట్లను సాధిస్తుంది, దాని మిత్రపక్షాలు ఎన్ని సీట్లలో గెలుస్తాయనేది ఆసక్తిదాయకమైన అంశం అవుతోంది.

ఇప్పుడు పోయిన ప్రాణాలను జేసీ సోదరులు తెచ్చిస్తారా?