సినిమా వాళ్లకు నేడు ఎన్నికల పరీక్ష!

-పతేపూర్ సిక్రీ నుంచి రాజ్ బబ్బర్ తో మొదలుకుని బెంగళూరు సెంట్రల్ లో ప్రకాష్ రాజ్ వరకూ నేడు పలువురు సినీనటులు ఎన్నికల పరీక్షను ఎదుర్కొంటున్నారు.

-దేశ వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల పోలింగ్ ఉదయాన్నే ప్రారంభం అయ్యింది. దాదాపు 95 లోక్ సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతూ ఉంది.

-తమిళనాడులో అత్యధికంగా ముప్పై తొమ్మిది స్థానాలకు పోలింగ్ జరుగుతూ ఉంది.
 
-కర్ణాటకలో పద్నాలుగు ఎంపీ సీట్లకు పోలింగ్ జరుగుతోంది. మరో పద్నాలుగు ఎంపీ సీట్లకు ప్రచార పర్వం అక్కడ కొనసాగుతూ ఉండటం విశేషం.

-కర్ణాటకలో సినీనటులు ఎన్నికల పరీక్షను ఎదుర్కొంటున్నారు. మండ్య నుంచి సుమలత పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ఆమెకు పోటీగా నిఖిల్ కుమారస్వామి రూపంలో సింగిల్ సినిమా స్టార్ ఉన్నారు.
 
-ప్రకాష్ రాజ్ పోటీలో ఉన్న బెంగళూరు సెంట్రల్ కు ఈరోజే పోలింగ్ జరుగుతోంది. కర్ణాటకలో ఈసారి ఉపేంద్ర పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీలో ఉంది. ఉపేంద్ర పోటీచేయడం లేదు కానీ, ఆయన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

-తమిళనాట కమల్ హాసన్ పార్టీ పోటీలో ఉంది. కమల్ కూడా పోటీ చేయడంలేదు. ఆయన పార్టీ తరఫున అభ్యర్థులు అమీతుమీ తేల్చుకుంటున్నారు.

-బీజేపీనేత, అలనాటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని పోటీలో ఉన్న మధుర నియోజకవర్గంలో కూడా ఈరోజే పోలింగ్ జరుగుతూ ఉంది.

పవన్ పార్టీ అక్కడ ఎవరిని ముంచినట్లు?