నెక్ట్స్ అరెస్టు కాబోయే కాంగ్రెస్ నేత ఆయనే?

చిదంబరం అరెస్టు తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరో కలకలం మొదలయ్యింది. వెనుకటికి సీబీఐ, ఈడీలను చేతిలో పెట్టుకుని కాంగ్రెస్ వ్యతిరేకులను ఆటాడించిన చిదంబరాన్ని ఇప్పుడు వాటి ద్వారానే అరెస్టు చేయించారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే తమ పాలనలోని తొలి ఐదేళ్లలో బీజేపీవాళ్లు ఈ పని చేయలేదు. రెండోసారి అధికారం వచ్చాకే ఈ పనులు జరుగుతూ ఉన్నాయి.

అయితే ఈ అరెస్టులు గట్రా ఇప్పుడే మొదలయ్యాయని.. ఇక నుంచి కథ మరోలా ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని మరింతగా దెబ్బతీసేలా మోడీ ప్రభుత్వ చర్యలు ఉండబోతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా నెక్ట్స్ టార్గెట్ కూడా రెడీ అయిపోయిందని ఢిల్లీ వర్గాల భోగట్టా.

అది మరెవరో కాదట శశిథరూర్. కాంగ్రెస్ జాతీయాధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి కూడా తను రెడీ అని ఇటీవలే ప్రకటించారు శశి. ఆయన మేథావే. వరసగా ఎంపీగా నెగ్గుతున్నారు కూడా. ఐక్యరాజ్యసమితిలో పని చేసినంత గొప్ప అనుభవం ఉంది. భాష ప్రవీణుడే. అయితే  శశి వ్యక్తిగత జీవితంలో మరకలున్నాయి. అందులో ముఖ్యమైనది ఆయన రెండోభార్య సునంద పుష్కర్ మరణం. అనుమానాస్పద పరిస్థితుల్లో ఆమె మరణించారు.

ఆ కేసు ఇంకా ఎటూ తేలడంలేదు. శశిథరూర్ ఒక పాక్ మహిళా జర్నలిస్టుతో అక్రమ సంబంధాన్ని నెరుపుతుండటాన్ని సహించలేక సునంద నిలదీసిందని, ఆ క్రమంలో ఆమెకూ, అతడికి మధ్య జరిగిన తోపులాటలో తగలరాని చోట తగిలి ఆమె మరణించిందనేది ఒక అభియోగం.

అయితే ఆ కేసు దాదాపు ఐదేళ్ల నుంచి విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ పోలీసులు అందుకు సంబంధించి విచారణను ఒక కొలిక్కి తీసుకురాబోతున్నారని.. ఆ మరణంతో శశికి సంబంధం ఉందనే ఆధారాలు లభించినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. బహుశా ఆ కేసులో శశిథరూర్ ను అరెస్టు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఢిల్లీ వర్గాలు లీకులు ఇస్తున్నాయని సమాచారం!

జగన్నాటకంలో మంత్రులకు సీన్‌ సితారే?

Show comments