‘సర్కారు’ బ్రేక్ ఈవెన్ గండం దాటేసినట్లేనా?

మహేష్ బాబు హీరోగా పరుశురామ్ అందించిన సినిమా ‘సర్కారు వారి పాట’. మిక్స్ డ్ టాక్, మంచి ఓపెనింగ్ తో విడుదలైన ఈ సినిమా ను మంచి రేట్లకు మార్కెట్ చేసారు. 

ఆంధ్ర 50 కోట్లు, సీడెడ్ 14, నైజాం 30 కోట్లకు మార్కెట్ చేసారు. ఫస్ట్ వీకెండ్ తరువాత సినిమా డౌన్ కావడంతో బ్రేక్ ఈవెన్ గండం కనిపించింది. అయితే సమ్మర్ హాలీడేస్ స్టార్ట్ అవుతున్నందున సెకెండ్ వీకెండ్ మీద ఆశపెట్టుకుంది.

ఆశ పెట్టుకున్న మేరకు కాకపోయినా సెకెండ్ వీకెండ్ కలెక్షన్లు బాగానే వున్నాయి. దీనివల్ల చాలా ఏరియాలు బ్రేక్ ఈవెన్ గండం దాటేసినట్లే. విశాఖ, ఈస్ట్, వెస్ట్, బ్రేక్ ఈవెన్ గండాన్ని దాటేసాయి. సీడెడ్ ఆల్ మోస్ట్ దగ్గరకు చేరింది. మరో రెండు కోట్లు రావాల్సి వుంది. కృష్ణ, నెల్లూరు మాత్రం ఇంకా సమయం పడుతుంది.

నైజాం జిఎస్టీతో కలిపి ఇప్పటికి మఫై కోట్లు దాటింది. కానీ ఇంకా అయిదు కోట్ల వరకు రావాలి. ఏం వచ్చినా ఈవారమే. ఎందుకంటే ఈవారం ఎఫ్ 3 విడుదల వుంది. దాని ఫలితం బట్టి నైజాం బ్రేక్ ఈవెన్ అన్నది ఆధారపడి వుంటుంది. రాబోయే వీకెండ్ కూడా కాస్త గట్టి కలెక్షన్లు రాబట్ట గలిగితేనే నైజాంలో బ్రేక్ ఈవెన్ అన్నది సాధ్యం.

Show comments