సన్నబడే పనిలో బన్నీ

బన్నీ-త్రివిక్రమ్ సినిమా సెట్ మీదకు వెళ్లడం తరువాయి అన్నట్లు వుంది. మెయిన్ కాస్టింగ్ దాదాపు ఫిక్స్ అయింది. పూజా హెగ్డే కథానాయిక. ధమన్ మ్యూజిక్ డైరక్టర్. ఓ సీనియర్ నటి ని తల్లి పాత్రకు తీసుకుంటున్నారు. అది కొద్ది రోజుల్లో వెల్లడవుతుంది. నగ్మా, నదియా మాత్రం కాదు. 

అయితే మార్చి మధ్యలో కానీ సినిమా స్టార్ట్ కాదు. అదేంటీ అంటే, బన్నీ ఇంకా రెడీ కాలేదంట. ఈ మధ్య బన్నీ కాస్త వళ్లు చేసాడట. అందువల్ల కాస్త తగ్గే పని మొదలు పెట్టాడట. మార్చి మధ్య వేళకు కానీ ఆ వ్యవహారం పూర్తి కాదట. అందుకే తనకు మార్చి 15 దాకా టైమ్ కావాలని బన్నీ అడగడం, త్రివిక్రమ్ ఓకె అనడం జరిగిపోయాయి.

అందువల్ల బన్నీ ఇప్పుడు జిమ్ లో కసరత్తులు చేస్తూ వళ్లు తగ్గే పనిలో వున్నారట. గీతా ఆర్ట్స్, హారిక హాసిని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తాయి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎస్ ఎస్ థమన్ చేసే రెండో చిత్రం ఇది. ఇటీవల ఈ ఇద్దరి కాంబినేషన్ లో అరవింద సమేత వచ్చింది.