సంక్రాంతి రేసులో 'ఎన్టీఆర్‌'కే ఎడ్జ్‌

సంక్రాంతికి మూడు భారీ సినిమాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి. మరిన్ని చిత్రాలని కూడా రేసులో నిలుపుతారా లేదా అనేది తెలియదు కానీ పోటీ అయితే మూడు చిత్రాల మధ్య వుండబోతోంది. బాలకృష్ణతో క్రిష్‌ తీస్తోన్న 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ మొదటి భాగం ముందుగా విడుదలవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం పట్ల ఆసక్తి పతాక స్థాయికి చేరుకుంది. ఒక్కో క్యారెక్టర్‌ పోస్టర్‌ రిలీజ్‌ అయ్యే కొద్దీ ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.

దీనికి పోటీగా విడుదలయ్యే రామ్‌ చరణ్‌, బోయపాటి శ్రీనుల 'వినయ విధేయ రామ' పూర్తిస్థాయి మాస్‌ చిత్రమని టీజర్‌తోనే తేలిపోయింది. హీరోయిజం ఆయుధంగా మాస్‌ మసాలా ఎలిమెంట్స్‌తో సినిమాని నింపేయడం బోయపాటి శైలి. ఈ చిత్రం అతను తీసే అన్ని సినిమాల ధోరణిలోనే వుండేలా వుంది. మాస్‌, ఫాన్స్‌ మాట ఎలా వున్నా సగటు సినీ ప్రియులకి ఈ ఫార్ములా రుచిస్తుందో లేదో చెప్పలేం.

ఇక వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌తో అనిల్‌ రావిపూడి తీస్తోన్న ఎఫ్‌2 పూర్తిస్థాయి కామెడీ చిత్రం. వినోదమే ప్రధానంగా రూపొందుతోన్న ఈ చిత్రంలోను వెరైటీ ఆశించలేం. దీంతో ఈ మూడు సినిమాల్లో అన్నిటికంటే భిన్నంగా, ప్రత్యేకంగా 'ఎన్టీఆర్‌' కనిపిస్తోంది.

ఎన్టీఆర్‌ జీవితం గురించి తెలుసుకోవాలనే కుతూహలానికి తోడు వివిధ ఎన్టీఆర్‌ గెటప్స్‌లో బాలయ్య కనిపించడం, ఇంకా చాలా మంది లెజెండ్స్‌ పాత్రలు తెరపైకి రావడం దీనికి అడ్వాంటేజ్‌ అవుతుంది. ఏమాత్రం డ్రామా పండినా మహానటిలా ఈ చిత్రం ప్రభంజనం సృష్టించే అవకాశాలే ఎక్కువ వున్నాయి.

ఆ టికెట్ల విషయంలో కుటుంబ పోరు!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

Show comments