శామ్..తొమ్మిది నెలల మార్పు

జనవరి లో లవ్ స్టోరీ టీజర్ విడుదల. సమంత ట్వీట్. ''..ఇంత కన్నా గొప్పగా మరెవరు చేయలేరు చైతూ..అక్కినేని...రోజు రోజుకు నటన పరంగా మరింత బలోపేతం అవుతున్నారు....'' ఇలాంటి అర్థం వచ్చేలా ట్వీట్

కట్ చేస్తే..

సెప్టెంబర్...లవ్ స్టోరీ ట్రయిలర్ విడుదలయింది. చైతూ ట్వీట్ నే రీ ట్వీట్ చేస్తూ, చైతన్యను టాగ్ చేయకుండా కేవలం సాయి పల్లవిని టాగ్ చేస్తూ జస్ట్ ''ఆల్ ది బెస్ట్ టు టీమ్'..

ఇదీ సమంత లో వచ్చిన మార్పు అనుకోవాలా? తొమ్మిది నెలల గ్యాప్ వచ్చిన తేడా అనుకోవాలా?  సమంత-చైతన్య ఒకరికి ఒకరు దూరం అవుతున్నారని పదే పదే గ్యాసిప్ లు వినిపిస్తున్న నేపథ్యంలో ఇలా ట్వీట్ వేయడం అంటే ఏమనుకోవాలి. 

ఎవరు ఏమనుకున్నా ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. అంత ఇగో ఏంటీ? చైతూను ట్యాగ్ చేయకుండా ట్వీట్ వేస్తావా? అంటూ.

Show comments