మామ సినిమాలో నటించనున్న కోడలు

నాగార్జున-సమంత కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్తేంకాదు. మనం సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించారు. నాగ్ చేసిన రాజుగారి గది-2లో కూడా సమంత కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు నాగార్జున నటిస్తున్న మన్మధుడు-2లో కూడా సమంత ఉంది. అయితే ఈ సినిమాలో నటించడానికి సమంత ఒప్పుకోవడానికి కారణం మాత్రం నాగార్జున కాదు.

రియల్ లైఫ్ లో రాహుల్ రవీంద్రన్, సమంత మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో తన క్లోజ్ ఫ్రెండ్స్ లో రాహుల ఒకడని సమంత ఎప్పడూ చెబుతుంటుంది. అలాంటి రాహుల్, మన్మధుడు-2 సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. అతడు కోరడంతో ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర చేయడానికి ఒప్పుకుంది సమంత.

అయితే సమంత లాంటి స్టార్ హీరోయిన్ ను ఊరికే ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రలో ఎవరూ పెట్టరు కదా. రాహుల్ ఆమె కోసం కాస్త పెద్ద క్యారెక్టరే రాసుకున్నాడట. అదేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమాలో నాగార్జున సరసన రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది.

మన్మధుడు-2 సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది. అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన సెట్ లో కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు తెరకెక్కించారు. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యానర్లపై వస్తున్న ఈ సినిమాకు చైతన్య భరధ్వాజ్ సంగీత దర్శకుడు.

వార్ వన్ సైడే.. నా? ఎవరి లెక్కలు వారివి!