సమంత 'బేబీ' సూపర్

విదేశీ సినిమా ఆధారంగా తయారవుతున్న చిత్రం ఓ బేబీ. సమంత-నందినీ రెడ్డిల కాంబినేషన్. మనసులో ఓల్డ్ లేడీ. బయటకు యంగ్ లుక్. ఇలాంటి చిత్రమైన కాన్సెప్ట్. సీనియర్ నటి లక్ష్మి, సమంత ఇద్దరు కలిసి ఒకే క్యారెక్టర్ లో కనిపిస్తారు.

ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. సినిమా టీజర్ సంగతి అలావుంచితే, టీజర్ లో సీనియర్ నటి లక్ష్మిని ఇమిటేట్ చేస్తూ, ఆమె వాయిస్ గుర్తుకు వచ్చేలా సమంత చెప్పిన డబ్బింగ్ భలేగా వుంది. సమంత పక్కన చిన్నదో, పెద్దదో కానీ నాగశౌర్య లుక్ కూడా బాగుంది. శౌర్య వాయిస్ కూడా బాగుంది.

టోటల్ గా టీజర్ బయటకు వచ్చి జనాలకు ప్రాజెక్టు మీద కాస్త మంచి ఆసక్తే పెంచుతుందన్నది వాస్తవం. రంగస్థలం తరువాత నుంచి సమంత క్రేజ్ మామూలుగా లేదు. యుటర్న్ సినిమాను సోలోగా సక్సెస్ ఛేసిన సమంత ఇప్పుడు ఓ బేబీ సినిమాను కూడా అలాగే భుజాల మీద వేసుకున్నట్లు కనిపిస్తోంది.