సంతలో సమంత: కూరగాయలు అమ్మిన బ్యూటీ

అక్కినేని కోడలు సమంత సైడ్ బిజినెస్ ప్రారంభించింది, కూరగాయల వ్యాపారంలోకి దిగింది. అయితే ఇది హైదరాబాద్ లో కాదు, చెన్నైలో. ఏకంగా తనే కూరగాయల షాపులో కూర్చుని అమ్మకాలు మొదలు పెట్టింది. సమంత సంతలో కూర్చుంటే జనాలు ఊరుకుంటారా వేలంవెర్రిగా ఎగబడి మరీ కూరగాయలు వేల రూపాయలకు కొనుక్కెళ్లారు. ఐదు నిమిషాల్లో కూరగాయలన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 

ఇంతకీ సమంత ఎందుకిలా చేసిందని అనుకుంటున్నారా. సినిమాలే కాదు, సమాజ సేవకి కూడా సమంత ఎప్పుడూ ముందుంటుంది. తనవంతు సహాయం చేయడంతో పాటు, స్వచ్ఛంద సంస్థలతో కలసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఆ మధ్య బధిరులకు హియరింగ్ కిట్స్ అందించిన సమంత.. తాజాగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం కూరగాయల వ్యాపారిగా మారింది. 

చిన్నారుల వైద్య ఖర్చుల నిమిత్తం జరిగిన ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సమంత చెన్నైలోని జామ్ బజార్ మార్కెట్ లో కూర్చుని కూరగాయలు అమ్మింది. అలా అమ్మగా వచ్చిన సొమ్ముని ఏపీలో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారుల చికిత్స కోసం కృషిచేస్తున్న సంస్థకు విరాళంగా అందించింది.

ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటోంది సమంత.

RELATED చంద్ర పోటు: నొప్పి తెలిసిందా పవన్‌.?