హీరోగారి సంపాదన రూ.253 కోట్లు!

అత్యంత సంపాదన పరులైన భారతీయ సెలబ్రిటీల జాబితాలో మరోసారి టాప్ పొజిషన్లో నిలిచాడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. క్రికెటర్లను, ఇతర సెలబ్రిటీలందరినీ దాటేసి సల్లూ ఈ జాబితాలో టాప్ లో నిలిచాడు. సల్మాన్ వార్షిక సంపాదన 253 కోట్ల రూపాయలు అని ఫోర్బ్స్ పేర్కొంది. తద్వారా ఈ జాబితాలో ఈ హీరో టాప్ పొజిషన్లో నిలుస్తున్నాడని పేర్కొంది.

ఇక జాబితాలో రెండోస్థానంలో నిలిచాడు టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ. కొహ్లీ వార్షిక సంపాదన 228 కోట్ల రూపాయలు అని ఫోర్బ్స్ పేర్కొంది. బోలెడన్ని యాడ్స్ లో కనిపిస్తూ, మ్యాచ్ ఫీజులు కూడా భారీగా పొందే కొహ్లీ కన్నా సల్మాన్ ఖాన్ ఎక్కువ సంపాదనపరుడై ఉండటం గమనార్హం.

లిస్టులో మూడోస్థానంలో నిలిచాడు అక్షయ్ కుమార్. వరసగా సందేశాత్మక సినిమాలే చేస్తున్న అక్షయ్ ఏడాదిలో నూటా ఎనభై ఐదుకోట్ల రూపాయలు సంపాదించాడని ఫోర్బ్స్ పేర్కొంది. నాలుగో స్థానాన్ని సొంతం చేసుకుంది దీపికా పదుకునే. ఇటీవలే వరసగా నాలుగు సినిమాలు చేసిన దీపిక సంపాదన రూ.114 కోట్లు అని ఫోర్బ్స్ వివరించింది.

విశేషం ఏమిటంటే.. అత్యంత సంపాదన పరుల జాబితాలో షారూక్ స్థానం పడిపోవడం. కింగ్ ఖాన్ వరస పరాజయాల్లో ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో అతడి సంపాదన బాగా పడిపోయిందని ఏడాదికి 56 కోట్ల రూపాయల స్థాయికి షారూక్ పడిపోయాడని ఫోర్బ్స్ పేర్కొంది.

ప్రియాంక చోప్రా కూడా సంపాదన విషయంలో బాగా వెనుకబడిపోయి జాబితాలో కిందకు వెళ్లిపోయింది. ఇదివరకూ ఫోర్ట్స్ లెక్కలపై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ.. అంత డబ్బు తను ఎక్కడ సంపాదించానని ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం!

అది లోకేష్ కెరీర్ కు మరింత మైనస్ కాదా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments