సైరా.. ఓ భావోద్వేగ పోరాట ప్రయాణం

మెగాస్టార్ మెగా మూవీ సైరా సినిమా ట్రయిలర్ విడుదలయింది. మెగా సందోహం మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఈ ట్రయిలర్ విడుదలయింది. మూడు నిమషాల పాటు సాగిన ఈ ట్రయిలర్ కట్ లో తొలిసారి కొంచెం కొత్త పుంతలు తొక్కే ప్రయత్నం చేసారు. రెండు మూడు విజువల్స్ చూపించి, ఆపై ట్రయిలర్ స్టార్ట్ చేసారు. 

ట్రయిలర్ మొత్తం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట జీవితాన్ని ఎలివేట్ చేయడానికే కేటాయించారు. ఒక్క సన్నివేశం మినహా మిగిలినదంతా నరసింహారెడ్డి పోరాటం సాగిన విధాన్నే చూపించారు. ట్రయిలర్ ఆరంభం నుంచి మెల్లగా నరసింహారెడ్డిని ఎలివేట్ చేస్తూ వెళ్లి, ఆపై పోరాటం సాగిన క్రమాన్ని, బ్రిటిష్ దురాగతాలను చూపించారు. 

ట్రయిలర్ లో విజువల్స్ అన్నీ భారీగా వున్నాయి. యుద్ధ సన్నివేశాలు, పోరాటాలు, మిగిలిన విజువల్స్ అన్నీ సినిమాకు పెట్టిన ఖర్చును చూపించాయి. ట్రయిలర్ కు వేసిన ఆర్ ఆర్ బాగుంది. మొత్తం మీద సైరా సినిమాకు మంచి బజ్ పెంచే విధంగానే కట్ చేసారు ట్రయిలర్ ను. 

చిరంజీవి, అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా లాంటి భారీ తారాగణం వున్న సైరా సినిమాకు సురేంద్ర రెడ్డి దర్శకుడు. రామ్ చరణ్ నిర్మాత. 

Show comments