సైరా శాటిలైట్ సై యేనా?

మొత్తానికి సాహో మాదిరిగా కాకుండా విడుదలకు ముందే బిజినెస్ వ్యవహారాలు అన్నీ ఫినిష్ చేసుకుంటోంది సాహో యూనిట్. థియేటర్ రైట్స్ అన్నీ ఇచ్చేసారు. ఒక్క ఏరియా కూడా వుంచుకోకుండా. ఓవర్ ఫ్లోస్ మాత్రం వుండేలా చూసుకున్నారు. అలాగే కొన్నాళ్ల క్రితం డిజిటల్ రైట్స్ ఇచ్చేసారు. ఇప్పడు శాటిలైట్ కూడా లాక్ చేసేసారు.

ఇక యూనిట్ దగ్గర మిగిలింది కేవలం హిందీ వెర్షన్ శాటిలైట్ ఒక్కటే. అయితే అన్ని డీల్స్ తాము అనుకున్న రేంజ్ లో చేసుకుంటూ వచ్చినా, శాటిలైట్ దగ్గర మాత్రం కుదిరినట్లు కనిపించడం లేదు. డిజిటల్ హక్కుల రూపంలో యాభై కోట్ల దగ్గరగా సంపాదించిన సైరా యూనిట్, అన్ని భాషల్లో శాటిలైట్ రూపంలో కనీసం వందకోట్లు వస్తాయని అంచనా వేసినట్లు బోగట్టా.

ఈ నేపథ్యంలో జీ లేదా స్టార్ మా ద్వారా అన్నిభాషల శాటిలైట్ హక్కుల బేరం కోసం చూసారు. మరి ఏమయిందో తెలియదు ఆఖరికి జెమిని సంస్థకు కేవలం తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ హక్కులు పాతిక కోట్లకు విక్రయించేసారు.

టాలీవుడ్ లెక్కల్లో పెద్ద మొత్తమే కానీ, ఆశించిన మొత్తం మాత్రం కాదు. అలాగే ఇక బాలీవుడ్ వెర్షన్ శాటిలైట్ సెపరేట్ గా అమ్మాలి. దాని నుంచి కూడా ఇరవై కోట్లకు కాస్త అటు ఇటుగా వస్తాయని లెక్కలు వినిపిస్తున్నాయి.

అయినా కూడా తాము అనుకున్న వందకోట్ల మార్కను చేరలేకపోయినట్లే. అయితే లెక్కలు అన్నీ ఎలావున్నా సైరా సినిమా విడుదల నాటికి నిర్మాత రామ్ చరణ్ కనీసం 50 నుంచి 100 కోట్ల మధ్యలో టేబుల్ ప్రాఫిట్ తెచ్చుకుంటారని ట్రేడ్ వర్గాల బోగట్టా.

వ్యాపారం కోసం ప్రమాణాలకు తిలోదకాలు

Show comments