సైరా క్లయిమాక్స్ ఏమిటి?

ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్ పాలకులు దారుణంగా చంపారు. ఆ యోధుడి తల తీసి, కోట గుమ్మానికి వేలాడగట్టారు. అదిచూసిన తరువాత మరెవరైనా మళ్లీ బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు దిగే ఆలోచన చేయకూడదు అన్నది వారి ఐడియా. అయితే సైరా పేరుతో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి సినిమాలో కూడా అదే క్లయిమాక్స్ ను చిత్రీకరించక తప్పదు.

ఇండస్ట్రీ వర్గాల బోగట్టా ప్రకారం సైరా సినిమాలో కూడా అదే రకమైన క్లయిమాక్స్ చిత్రీకరించారని తెలుస్తోంది. అయితే దాంతోపాటు ఉయ్యాలవాడను దారుణంగా చిత్రహింలు చేసినట్లు, కత్తులతో ఇష్టం వచ్చినట్లు దాడిచేసి కోతలు కోసినట్లు క్లయిమాక్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆ సన్నివేశం తాలూకా సీజీ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తోంది.

అయితే ఇంత వయిలెంట్ క్లయిమాక్స్ ను వుంచడమా? కాస్త తగ్గించడమే అనే మీమాంసలో మెగాస్టార్ వున్నారని టాక్ వినిపిస్తోంది. దాదాపు వారంరోజుల కిందటే ఈ డైలమా స్టార్ట్ అయిందని, డిస్కషన్లు నడుస్తున్నాయని, ఏ మేరకు వుంచాలన్నది ఇంకా డిసైడ్ కాలేదని తెలుస్తోంది.

సైరా సినిమా అక్టోబర్ 2న థియేటర్లలోకి వస్తుంది.

తన భయం.. రాష్ట్రంపై రుద్దితే ఎలా?

Show comments