'సైరా' చివరి కోరిక అదే

తొట్ట తొలి స్వాతంత్ర్య పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం కూడా చాలామంది యోధుల జీవితాల మాదిరిగానే బ్రిటిష్ వారి చేతిలో ముగిసిన సంగతి తెలిసిందే. సైరా సినిమాలో ఇప్పుడు క్లయిమాక్స్ కూడా అదే. అయితే అల్లూరి సీతారామరాజులో, హీరో కృష్ణ ఒక్కో తుపాకి గుండు తనను తాకినపుడల్లా ఒక్కో డైలాగు తూటాలా పేల్చారు.

సైరాలో కూడా అలాంటి డైలాగ్ తూటా ఒకటి వుంది. ప్రీ క్లయిమాక్స్ గా భారీ ఫైట్ సీన్ అయిపోయిన తరువాత నరసింహారెడ్డిని చంపే ముందు, 'నీ ఆఖరి కోరిక కోరుకో.. అది ఒక్క సెంటెన్స్ లో చెప్పు' అని అడుగుతారట బ్రిటిష్ జనాలు. అప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వాళ్లకు అర్థంకావాలని ఇంగ్లీష్ లో ఒకే సెంటెన్స్ లో ఒక డైలాగ్ చెబుతాడు.

'ఫ.. ఆఫ్ ఫ్రమ్ మై కంట్రీ' అన్నది ఆ డైలాగ్ అని ఇప్పడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మెగాభిమానులు ఊహించుకోండి.. ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్ మెగాస్టార్ వెంట ఏ రేంజ్ లో వచ్చి వుంటుందో? మెగాస్టార్ నోటివెంట ఓ చిన్న ఇంగ్లీష్ బూతు మాట వినిపించక తప్పలేదు. ఎందుకంటే ఆ ఫోర్స్, కాంటెంపరరీ ఆడియన్స్ టేస్ట్ ప్రకారం ఆ మాట వాడినట్లు కనిపిస్తోంది.

ఎంత పని చేసావయ్యా సుజీత్‌!