సాయిధరమ్ కు ముందే హెచ్చరిక

హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.  అచ్చంగా ప్రమాదం తప్ప కోరి తెచ్చుకున్నది కాదు. ఎవరికైనా జరిగేదే. అందులో సందేహం లేదు. 

నిత్యం హైదరాబాద్ రోడ్ల మీద ఎన్నో బళ్లు స్కిడ్ అవుతుంటాయి. అవన్నీ లెక్కకు రావు. ఎందుకుంటే వాళ్లంతా సామాన్యులు కాబట్టి. సెలబ్రిటీ కాబట్టి ఇంత హఢావుడి. 

ఇదిలా వుంటే కొన్నాళ్ల క్రితమే సాయి ధరమ్ తేజ్ కు ఈ ప్రమాదం గురించి చిన్న హెచ్చరిక అందింది. ఇండస్ట్రీకి చెందిన ఒకరికి కాస్త గట్టి జ్యోతిష్య పరిజ్ఞానం వుంది. ఆయన సాయి ధరమ్ తో సాన్నిహిత్యమూ వుంది. ఆ అనుబంధంతోనే సాయి ధరమ్ జాతకంలో గ్రహాల కదలిక అంత బాగా లేదని బళ్లు డ్రైవ్ చేసే టపుడు కాస్త జాగ్రత్తగా వుండమని హెచ్చరించారు. 

అంతే కాదు గ్రహశాంతికి కొన్ని రెమిడీలు కూడా సూచించారు. సాయి ధరమ్ ఏమీ ఎథీస్ట్ కాదు. నమ్మకాలు వున్నవ్యక్తే. అందుకే అలా చేయిస్తా అని అన్నాడు. కానీ ఈలోగా ఈ ప్రమాదం జరిగిపోయింది.

Show comments