సాహో.. విడుదల ఎప్పుడు?

బాహుబలి ప్రభాస్ భారీ సినిమా సాహో విడుదల తేదీ వాయిదా పడడం, 'డార్లింగ్' ఫ్యాన్స్ ను కొంచెం నిరాశకు గురిచేసింది. అనధికారికంగా వాయిదా అన్న వార్త బయటకు వచ్చింది కానీ, ఇప్పటి వరకు సాహో నిర్మాతలు అయిన యువి క్రియేషన్స్ నుంచి క్లారిటీ అయితే రాలేదు. ఈ విషయంలో సాహో పీఆర్ వింగ్ దగ్గర కూడా సరైన సమాధానం లేదు.

ఇదిలావుంటే సాహో ఈనెల 30న విడుదలవుతుందని, అది సరైన డేట్ అని, వినాయకచవితి సందర్భం, అమెరికాలో కూడా సెలవులు వున్నాయని వినిపిస్తోంది. మరి ఆ రోజుకు వస్తుందా? రాదా? అన్నది కూడా క్లారిటీలేదు. ప్రస్తుతం సాహో యూనిట్ డేట్ ఎప్పుడు అన్నది డిసైడ్ చేసుకునే పనిలో వున్నట్లు తెలుస్తోంది.

అన్ని పనులు ఎప్పటికి ఫినిష్ అవుతాయి? విఎఫ్ఎక్స్ పనులు కచ్చితంగా ఏ డేట్ కు వస్తాయి? థియేటర్ల అవైలబులిటీ? హాలీడేస్? ఇవన్నీ పక్కాగా చూసుకుని డేట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. మరోసారి ఇప్పుడు వాయిదా పడినట్లు పడే ప్రసక్తి లేకుండా చూసుకోవాలని, ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 30న విడుదల సాధ్యమవుతుందా? లేక సెప్టెంబర్ 13ను డేట్ గా ప్రకటించాలా? అన్న చర్చలు సాగుతున్నట్లు బోగట్టా. ఏ విషయమూ ఎక్కువ టైమ్ తీసుకోకుండా ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే ఆలోచనలో యువి నిర్మాణ సంస్థ వుంది. అందువల్ల బాహుబలి ప్రభాస్ అభిమానులు సాహొ డేట్ కోసం మరో రెండురోజులు వెయిట్ చేయాల్సిందే.

బ్యూటిఫుల్ హీరోయిన్ తో క్యూట్ యాంకర్ ఇంటర్వ్యూ

పూరి చూసిన ఎత్తుపల్లాలు ఏమిటి

Show comments