సాహో.. వచ్చేసింది

బాహుబలి ఫ్రభాస్ భారీ మూవీ సాహో. ఈ సినిమా విడుదలై యాభై రోజులు అయింది. దాంతో అమెజాన్ ప్రయిమ్ లోకి వచ్చేసింది. సాహో తెలుగునాట దాదాపు 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాలీవుడ్ లో భారీ వసూళ్లు సాధించింది. అయినా ఇంకా చూడనివాళ్లు, చూడాలని అనుకున్నవాళ్లు వుంటే, అమెజాన్ ప్రయిమ్ లో చూసేసుకోవచ్చు.

ఎలాంటి సినిమా అయినా అమెజాన్ కు ఒకటే. అయితే ముఫై రోజులు, లేదూ అంటే 45 నుంచి 50 రోజులు. అంతే. టక్కున ప్రయిమ్ లో ప్రత్యక్షం అయిపోవాల్సింది. తెలుగునాట అమెజాన్ ప్రయిమ్ భయంకరమైన పాపులారిటీ సాధించేసింది. మిగిలిన ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ ల మాదిరిగా అమెజాన్ ప్రయిమ్ కు ఆంక్షలు ఏవీలేవు.

ఒక్క అక్కౌంట్ తో ఎన్ని డివైస్ లు అయినా లాగిన్ కావచ్చు. జీ 5 అలా కాదు. పైగా అమెజాన్ ప్రయిమ్ లో వున్నన్ని తెలుగు సినిమాలు అటు నెట్ ఫ్లిక్స్ లో కానీ, జీ 5, సన్ లో కానీ లేవు. అమెజాన్ పాపులారిటీ చూసి, పెద్ద సినిమాలను తెలివిగా దానికి అమ్మకుండా నెట్ ప్లిక్స్ కు అమ్మాలని చూస్తున్నారు నిర్మాతలు.

అలా అయితే థియేటర్ కలెక్షన్లు దెబ్బతినవని ఆలోచన. నాగ్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. ఆయన తన మన్మధుడు 2ను నెట్ ఫ్లిక్స్ కే అమ్మారు. సురేష్ బాబు, మరి కొంతమంది కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సినిమాలకు ఆన్ లైన్ లో వ్యూస్, పాపులారిటీ రావాలంటే మాత్రం అమెజాన్ ప్రయిమ్ నే దిక్కు.

Readmore!

సినిమా రివ్యూ: రాజుగారి గది 3

Show comments