రుధిరం.. శిశిరం.. సమరం

త్రివిక్రమ్ కు మాటల్లో వున్న బలం ఇంతాఅంతా కాదు. అందుకే సాధారణంగా టీజర్ అంటే జస్ట్ ఓ పంచ్ తో ఎండ్ అయ్యే దానికి భిన్నంగా మూడు నాలుగు డైలాగులు చెప్పించి, చొప్పించి, శభాష్ అనిపించేసుకున్నడు. అరవింత సమేత వీరరాఘవ సినిమా మీద వున్న అంచనాలను అమాంతం పెంచేసాడు.

మాటలను ఈటెల్లా విసరడంలో త్రివిక్రమ్ తనకు సాటిలేదని మరోసారి చూపించాడు. హీరోను విలన్ మాటల్లో అంతబలంగా ఇంతకన్నా చెప్పలేరేమో? హీరో కూడా తన పద్దతిని రెండుమాటల్లో ఇంతకన్నా క్లారిటీగా మరెవరు చెప్పలేరేమో?

మొత్తంమీద ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఓ మాంచి బోయపాటి స్టయిల్ సినిమా తీసి చూపించే ప్రయత్నం చేస్తున్నట్లుంది.అయితే ఇక్కడ తేడా ఏమిటంటే బోయపాటి ఎమోషన్లు పండించగలడు కానీ, ఫన్ మాత్రం కాదు. కానీ త్రివిక్రమ్ కలానికి ఆ బలం కూడా వుంది. మాస్ టీజర్ ఇలా వుందంటే, సినిమాలో ఫన్ కు ఎలాగూ గ్యారంటీ వుంటుంది.

టీజర్ కు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రవుండ్ స్కోర్ లో రం.. రుధిరం.. రం.. శిశిరం.. రం.. సమరం అంటూ చెప్పడం ద్వారా కథలోని మూడు ఫేజ్ లను త్రివిక్రమ్ చెప్తున్నట్లు వుంది.

Readmore!

Show comments