ఆర్-ఆర్-ఆర్... అంతా వైరల్

దసరా సందర్భంగా చాలా సినిమాల నుంచి టైటిల్స్ వచ్చాయి. మరికొంతమంది హీరోలు తమ కొత్త సినిమాల్లో లుక్స్ రిలీజ్ చేశారు. అలాగే ఆర్-ఆర్-ఆర్ యూనిట్ నుంచి కూడా టైటిల్ పోస్టర్ వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా నుంచి ఇలా సైలెంట్ గా ఓ పోస్టర్ రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ అది అఫీషియల్ పోస్టర్ కాదు, ఫ్యాన్ మేడ్ పోస్టర్.

ఆర్-ఆర్-ఆర్ సినిమాకు రామ రౌద్ర రుషితం అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తో ఎవరో పోస్టర్ రిలీజ్ చేశారు. అదే నిజమైన టైటిల్ అనుకొని అంతా షేర్లు, లైకులు కొట్టడం స్టార్ట్ చేశారు. అలా ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ వైరల్ అయింది. అంతేతప్ప అదే నిజమైన టైటిల్ కాదు. ఆర్-ఆర్-ఆర్ టైటిల్ పై గతంలో కూడా ఇలానే కొన్ని ఊహాగానాలు చెలరేగాయి.

వాటిలో దేనికీ దక్కని ప్రచారం ఈ రామ రౌద్ర రుషితం అనే టైటిల్ కు దక్కింది. దీనికి కారణం ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ఇండస్ట్రీలో కొంతమంది పీఆర్ఓలు కూడా షేర్ చేయడమే. స్వయంగా కొంతమంది పీఆర్ టీమ్ సభ్యులు షేర్ చేయడంతో ఇది నిజమైన పోస్టర్ అయి ఉంటుందని చాలామంది భావించారు. అలా ఇది వైరల్ అయింది. పైగా దసరా సీజన్ కూడా కావడంతో అంతా ఇది నిజమనే అనుకున్నారు.

వాస్తవం ఏంటంటే.. ఆర్-ఆర్-ఆర్ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. తాజా పోస్టర్ కు సంబంధించి అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన లేదు. టైటిల్ కు సంబంధించి సినిమా ఎనౌన్స్ మెంట్ రోజునే కాంటెస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆర్-ఆర్-ఆర్ ను విడమర్చేలా చాలా ఆప్షన్స్ వచ్చాయి. వాటిలోంచి ఒకటి ఎంపిక చేసే ప్రక్రియను ఇంకా స్టార్ట్ చేయలేదు.

చంద్రబాబుకు ఎందుకు రుచించడం లేదు