ఆర్ఆర్ఆర్ డిస్కషన్లు షురూ

కరోనా కల్లోలం నుంచి మెల్లగా కోలుకుంటోంది టాలీవుడ్. ఒక్కొక్క హీరో మెల్లగా సెట్ మీదకు వస్తున్నారు. అయితే చకచకా షూటింగ్ లు చేసేయాలన్నా సమ్యస్యే. ఎందుకంటే కాంబినేషన్ ఆర్టిస్టులు అందరూ ఒకేసారి అన్ని సినిమాలకు దొరకడం అంటే కాస్త కష్టం. ఒకేసారి అన్ని సినిమాలు స్టార్ట్ అయ్యే అవకాశం తక్కువ.

ఇలాంటి నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమాకు మరీ కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమా షూటింగ్ కు సమస్యలు వున్నాయి. అక్టోబర్ 1 నుంచి నిబంధనలు సడలుతాయని అంచనా వేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ పోస్ట్ కరోనా రీషెడ్యూలు వ్యవహారాల మీద డిస్కషన్లు ప్రారంభమయ్యాయి.

ఎంత వర్క్ వుంది. ఎలా షెడ్యూళ్లు మళ్లీ ప్లాన్ చేయాలి. గతంలో అనుకున్న లోకేషన్లు అందుబాటులో వున్నాయా? లేక మార్చాలా? వీలయినంత తక్కవ గ్యాప్ తీసుకుని షెడ్యూళ్లు ప్లాన్ చేస్తే, ఎప్పటికి విడుదల పాజిబుల్ అవుతుంది ఇలాంటి లెక్కలు అన్నీ రాజమౌళి అండ్ టీమ్ కాస్త గట్టిగా సమాలోచనలు చేస్తున్నట్లు బోగట్టా. 

వీలయినంత వరకు 2021లో సినిమాను తీసుకురావడానికి ఏమైనా పాజిబుల్ వుంటుందా? లేని పక్షంలో 2022 జనవరి నాటికి ప్లాన్ చేస్తే, వీలయినంత త్వరగా ఇద్దరు హీరోలను ఎలా రిలీవ్ చేయాలి అన్నది కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ డిస్కషన్ లో కీలకపాయింట్ గా వుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

జగన్ ని చూసి నేర్చుకో

Show comments