'సాధించేశా..' రోజా ఫేస్ బుక్ పోస్ట్!

మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కేరోజా ఒకకీలక పదవిని సాధించుకున్నట్టుగా ఉంది. మంత్రిపదవి దక్కలేదని వార్తల్లో నిలిచిన రోజా ఏపీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసి.. ప్రాధాన్యత ఉన్న ఒక పదవిని సాధించుకున్నట్టుగా తెలుస్తోంది. మంత్రిపదవి దక్కలేదనే అసంతృప్తితో జగన్ ను కలిసిన ఆమె ఏపీఐఐసీ చైర్మన్ పదవిని సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో ప్రకటించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీఐఐసీ) చైర్మన్ పదవికి మొదటి నుంచి మంచి ప్రాధాన్యత ఉంది. పరిశ్రమల ఏర్పాటులో ఏపీఐఐసీ కీలకపాత్ర పోషిస్తూ ఉంటుంది. ఆ సంస్థ చైర్మన్ పదవి తనకు దక్కిందని రోజా ప్రకటించుకున్నారు. ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతూ ఆమె ఫేస్ బుక్ లో పోస్టుపెట్టారు.

తద్వారా ఆమె తన ఆనందాన్ని పంచుకున్నారు. మంత్రిపదవి దక్కకపోయినా రోజాకు ప్రాధాన్యతతో కూడిన ఈ పదవి దక్కినట్టుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్లో చోటు దక్కకపోవడంతో రోజా విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉండటం, నటి కావడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా కష్టపడి ఉండటం, మహిళా కోటా.. ఈ కారణాలతో రోజాకు మంత్రిపదవి దక్కకపోవడం చర్చనీయాంశంగా నిలిచింది. ఇప్పుడు ఐపీఐఐసీ చైర్మన్ పదవితో రోజా ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నారు.

సవాల్ చేశారుగా.. సీమ పౌరుషాన్ని చూపుతారా?