రోబో జనవరిలో రాదన్నమాటే

రోబో 2సినిమా విడుదల డేట్ పై అయోమయం నెలకొంది కొన్నాళ్లుగా. సమ్మర్ కు వెళ్లిపోయిందని ఇండస్ట్రీలో గుసగుసలు. కానీ నిర్మాతలు మాత్రం ఏ విషయం చెప్పలేదు. అలాంటిది ఇప్పడు ఉన్నట్లుండి యువి సంస్థ తమ భాగమతి సినిమా విడుదల తేదీని హటాత్తుగా జనవరి 26గా ప్రకటించింది.

వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికి అనుకున్నారు. కానీ ఇటీవలే ఫిబ్రవరి 9న విడుదల చేయాలని, లేదా మార్చిలో డేట్ చూడాలని ఫిక్సయ్యారు. అయితే ఇప్పడు ఉన్నట్లుండి జనవరి 26కు వచ్చేస్తున్నాం అని అధికారికంగా ప్రకటించారు. అంటే రోబో 2రాదని పక్కగా తెలిసి వుండాలి.

యువి సంస్థకు తమిళ ఇండస్ట్రీతో కూడా మాంచి సంబంధాలు వున్నాయి. జ్ఞాన్ వేల్ రాజా వంటి వారితో వ్యాపార బాంధవ్యాలు వున్నాయి. అందువల్ల రోబో 2సంగతి పక్కగా తెలియకుండా భాగమతి డేట్ అయితే ప్రకటించరు. సో, రోబో 2సమ్మర్ కు వెళ్లిపోయిందనే అనుకోవాలి.

ఇప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. సమ్మర్ నే నమ్ముకుని రామ్ చరణ్, బన్నీ, మహేష్ బాబుల సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ రోబో 2 డేట్ చూసుకుని, తదనుగుణంగా రీ షెడ్యూలు చేసుకోవాలి.

Show comments