కేసీఆర్ బయోపిక్.. మరో చిచ్చు పెడుతున్న వర్మ!

సినిమాల్లో నాణ్యత ఉండటం లేదు.. అనే విమర్శలు వస్తున్నా రామ్ గోపాల్ వర్మ అస్సలు తగ్గడంలేదు. ఇటీవలే వర్మ చేసిన సంచలన ప్రయత్నం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఆకట్టుకోలేకపోయినా, ఇప్పుడు మరో సినిమాను అనౌన్స్ చేశాడు ఈ దర్శకుడు. ఈసారి వర్మ కేసీఆర్ బయోపిక్ అంటున్నాడు.

అందుకు సంబంధించి ఒక టైటిల్ లోగోను కూడా వర్మ ట్వీట్ చేశాడు. ఈ సినిమా పేరు 'టైగర్ కేసీఆర్' అంట. 'ది అగ్రిసివ్ గాంధీ' అనేది ట్యాగ్ లైన్. దాని కింద  'ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు' అంటూ మరో ట్యాగ్ పెట్టాడు ఆర్జీవీ.

ఇంతవరకూ ఓకే కానీ.. తన సినిమా గురించి వర్మ వివరిస్తూ.. తెలంగాణ- ఆంధ్ర అంటూ చిచ్చుపెట్టే ప్రయత్నం చేశాడు. ''It is a biopic of @KTRTRS ‘s father from the time he couldn’t bear the 3rd class treatment being given to Telangana people by the Andhras, and how he fought in a fiery way to achieve Telangana state.'' అంటూ ట్వీటాడు ఆర్జీవీ.

ఆంధ్రా ప్రజలు తెలంగాణ ప్రజానీకాన్ని థర్డ్ క్లాస్ సిటిజన్స్ గా ట్రీట్ చేశారంటూ వర్మ చెప్పుకొచ్చాడు. ఆల్రెడీ ముగిసిపోయిన ప్రాంతాల మధ్య యుద్ధం గురించి ఇప్పుడు వర్మ మళ్లీ ఎందుకు కెళుకుతున్నాడో అందరికీ తెలిసిందే. వర్మకు వివాదం కావాలి. లేనిచోట కూడా దాన్ని రాజేయాలి. అందుకే ఈ తంటాలు!

పవన్ పార్టీ అక్కడ ఎవరిని ముంచినట్లు?

Show comments