మహానాయకుడు.. ఈసారి టార్గెట్ రానా

తను లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రారంభించినప్పట్నుంచి ఎన్టీఆర్ బయోపిక్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నాడు ఆర్జీవీ. ఎప్పటికప్పుడు ఆ సినిమాపై, ఆ సినిమాలో నటీనటులపై సెటైర్లు వేస్తూనే ఉన్నాడు. పార్ట్-1 కథానాయకుడు రిలీజై డిజాస్టర్ అయిన తర్వాత కూడా వర్మ ట్వీట్ల ప్రవాహం ఆగలేదు. ఇంకా చెప్పాలంటే అతడి విమర్శలు ఆ తర్వాతే ఎక్కువయ్యాయి.

ఎన్టీఆర్-మహానాయకుడు సినిమాపై ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తూనే ఉన్నాడు వర్మ. మరీ ముఖ్యంగా అతడి కామెంట్స్ అన్నీ చంద్రబాబు పాత్ర చుట్టూ తిరుగుతున్నాయి. రిలీజ్ కు ఇంకొన్ని గంటలు మాత్రమే ఉందనగా వర్మ ఇంకాస్త ఊపందుకున్నాడు.

చంద్రబాబు గెటప్ లో  ఉన్న రానా స్టిల్ ను పోస్ట్ చేసిన ఆర్జీవీ.. రానా లుక్ అదిరిపోయిందని, ఒరిజినల్ కంటే ఇంకాస్త ఒరిజినల్ గా కనిపిస్తున్నావని ట్వీట్ చేశాడు. ట్వీట్ అయితే రానాకు నచ్చింది కానీ, రీట్వీట్ కొడితే కచ్చితంగా చంద్రబాబు, బాలయ్యకు కోపం వస్తుందని తెలుసు. అందుకే సైలెంట్ గా ఉన్నాడు.

రానా రీట్వీట్ కోసం ఎదురుచూసే రకం కాదు వర్మ. ఈసారి ఇంకాస్త గట్టిగా పోస్ట్ పెట్టాడు. బాలయ్య వెనక రానా ఉన్న ఫొటోను పోస్ట్ చేసి.. చంద్రబాబు పాత్రధారి ఎప్పుడు తన జేబు లోంచి కత్తి తీసి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడుస్తాడో చూడాలని ఉందంటూ మరో పోస్ట్ పెట్టాడు.

ఇక్కడితో ఆగకుండా చంద్రబాబు చేసిన ఓ కామెంట్ పై ఏకంగా పోల్ పెట్టాడు వర్మ. ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని.... కుట్రదారుల దుష్ప్రచారాన్నితిప్పికొట్టాలని చంద్రబాబు వ్యాఖ్యానించగా.. నాది కుట్రా..? లేక నిజమా చెప్పాలంటూ పోలింగ్ పెట్టాడు వర్మ.

ఇలా మహానాయకుడు చుట్టూ ఆర్జీవీ చేస్తున్న హంగామా ఓ రేంజ్ లో ఉంది. ఈ మేరకు తను తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని కూడా కాసేపు పక్కనపెట్టేశాడు. రేపు థియేటర్లలోకి రాబోతున్న మహానాయకుడు సినిమా ఫ్లాప్ అయితే ఈ దర్శకుడు ఇంకెంతలా రెచ్చిపోతాడో!

రాయలసీమ రైతుల పుండుపై కారం