లోకేష్ కు రిటర్న్ గిఫ్ట్ రెడీ అవుతోందా?

చంద్రబాబు పుత్రరత్నం అటుఇటు తిరిగి ఎలాగోలా మంగళగిరిలో సెట్ అయ్యారు. దొడ్డిదారిన మంత్రి అయి మొన్నటివరకు రాజసం ఒలకబోసిన చినబాబు, ఇప్పుడు ప్రజల మధ్య తిరుగుతూ అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు గెలుపు తమదే అనే మేకపోతు గాంభీర్యం కూడా ప్రదర్శిస్తున్నారు. అయితే చంద్రబాబు, లోకేష్ ఏం ఆలోచించి మంగళగిరిని ఫిక్స్ చేసుకున్నారో కానీ, ప్రస్తుతం పరిస్థితులు మాత్రం వాళ్లకు అక్కడ అనుకూలంగా లేవు.

లోకేష్ ను ఎట్టిపరిస్థితుల్లో ఓడించాలని మంగళగిరి ప్రజలు ఫిక్స్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఏ వర్గమైతే తనను అక్కున చేర్చుకుంటుందని భావించారో అదేవర్గం రివర్స్ అవ్వడంతో లోకేష్ గుడ్లు తేలేశారు. అవును.. లోకేష్ ఓటమికి అంతా కృషిచేయాలంటూ నియోజకవర్గానికి చెందిన పద్మశాలీ వర్గీయులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. అంతేకాదు, మంగళగిరిలో బంద్ కూడా చేపట్టారు.

దీనివెనక తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మంత్రాంగం ఉన్నట్టు తెలుస్తోంది. లోకేష్ మంగళగిరిని ఎంచుకున్న వెంటనే తలసాని రంగంలోకి దిగారట. తెలంగాణ సిరిసిల్లకు చెందిన పద్మశాలీల్ని రంగంలోకి దించారట. గత ఎన్నికల్లో తన నియోజకవర్గంలో తనను ఓడించడానికి లోకేష్ తీవ్రంగా ప్రయత్నించారని, అందుకు ప్రతిగా అతడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నారు తలసాని.

దీనికితోడు ఇదే నియోజకవర్గంలో పద్మశాలీ వర్గానికి చెందిన ఓ మహిళా నేతకు టిక్కెట్ ఇస్తానని నమ్మబలికి ఆఖరి నిమిషంలో ఆమెను బలిపశువును చేశారు చంద్రబాబు. ఇది కూడా లోకేష్ కు ఆ వర్గం దూరమవ్వడానికి ఓ కారణం. ఈ నేపథ్యంలో మంగళగిరిలో బీసీలందర్నీ ఏకం చేసి అతడ్ని ఓడించాలని తలసాని భావిస్తున్నారు.

మరోవైపు లోకేష్ మాత్రం పూర్తిగా డబ్బునే నమ్ముకున్నారట. పైపైన ప్రచారం చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నప్పటికీ.. సరిగ్గా ఎన్నికలకు 2 రోజుల ముందు నోట్ల వరద పారించాలని లోకేష్ నిర్ణయించుకున్నారట. ఈ మేరకు గల్లా జయదేవ్ తో రూట్ మ్యాప్ కూడా సిద్ధంచేసిన చినబాబు, అవసరమైతే నోటుకు 10వేల రూపాయలు కూడా ఇవ్వడానికి వెనకాడ్డం లేదని తెలుస్తోంది. 

చంద్రబాబు నిర్ణయాల పలితం-శక్తిమంతంగా KCR 

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?