అంద‌రూ మీలా మంచిగా ఉండాలంటే ఎలా రేణు?

న‌టి, నిర్మాత రేణుదేశాయ్ సామాజిక అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తూ మాన‌వ‌త్వాన్ని చాటుకుంటుంటారు. మ‌నుష‌లంతా మంచిగా ఆలోచించాల‌ని, మంచి ప‌నులే చేయాల‌ని ఆశిస్తుంటారు. ఆమెదంతా పాజిటివ్ దృక్ప‌థం. అందుకే ఆమెకు సినీన‌టి కంటే కూడా సామాజిక కార్య‌క‌ర్త‌గా ప్ర‌త్యేక గుర్తింపు. ఆ మ‌ధ్య రైతు స‌మ‌స్య‌ల‌పై జ‌ర్న‌లిస్టు అవ‌తార‌మెత్తి ఓ డాక్యుమెంట‌రీని కూడా తీసిన విష‌యం తెలిసిందే.

 హైద‌రాబాద్ శివార్ల‌లో దిశ‌పై అత్యాచారం, హ‌త్య ఘ‌ట‌న  దేశ‌వ్యాప్తంగా నిన్న‌టి వ‌ర‌కు తీవ్ర దుమారం రేపింది. ఆ దుర్ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన న‌లుగురు కామాంధులు శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఎన్‌కౌంట‌ర్‌లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎన్‌కౌంట‌ర్‌పై వ‌చ్చిన అనేక స్పంద‌న‌ల్లో రేణుదేశాయ్ కామెంట్ ఆస‌క్తిక‌రంగా మారి చ‌ర్చ‌కు దారి తీసింది.
 
ప‌లు మీడియా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో ఆమె మాట్లాడుతూ   "ఎన్‌కౌంటర్‌పై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసేవారికి ఏ మాత్రం మానవత్వం ఉందో ఆలోచించుకోవాలి. నిందితులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని నేను సమర్థిస్తున్నాను. తప్పొప్పుల గురించి చ‌ర్చ వ‌ద్దు. ఎందుకు? ఎలా జరిగింది? అనేది పక్కన పెడ‌దాం.  ఈ ఎన్‌కౌంట‌ర్‌ తర్వాత మరొకరు ఇలాంటివి చేయాలంటే భయపడతారు. ఆడపిల్లల గురించి ఆలోచించాలంటేనే భయపడాలి. ఆ పరిస్థితులు రావాలి" అని రేణు అభిప్రాయ‌ప‌డ్డారు.

గ‌తంలో ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న వివాహ జీవితం విచ్ఛిన్నం కావ‌డానికి కార‌ణాల‌ను రేణు వెల్ల‌డిస్తూ ఎంతో ఆవేద‌న చెందారు.  "నాతో కాపురం చేస్తూ ర‌ష్య‌న్ యువ‌తిని గ‌ర్భ‌వ‌తి చేశాడు. ఈ వాస్త‌వం తెలిసిన త‌ర్వాత ఒక భార్య‌గా, మ‌హిళ‌గా నా మాన‌సిక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. భ‌రించడం చాలా క‌ష్ట‌మైంది. అయినా క‌లిసే ఉండాల‌నుకున్నా. కానీ ఆయ‌న విడాకులు అడిగారు" అని ఆమె చెప్పారు.

సంసారం గుట్టు వ్యాధి ర‌ట్టు అని పెద్ద‌లు చెప్పారు. జీవిత భాగ‌స్వామితో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా...ఏనాడూ బ‌జారుకెక్క‌లేదు. మూడో కంటికి తెలియ‌కుండా విడిపోయి త‌న‌దైన జీవితాన్ని గ‌డుపుతున్నారు. ఇప్పుడూ దిశ ఎన్‌కౌంట‌ర్‌పై మాన‌వ‌హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేయ‌డాన్ని ఆమె త‌ప్పు ప‌డుతున్నారు. రేణూ గారూ అంద‌రూ మీలా మంచిగా ఉండాలంటే ఎలా అని హ‌క్కుల సంఘాల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

Show comments