రాయపాటి బెదిరింపులు బాగానే పనిచేశాయి

టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా వచ్చేసింది. ఆశ్చర్యకర మలుపులైతే లేవు. దాదాపుగా అన్నీ నలుగుతున్న పేర్లే కనిపించాయి. సిట్టింగులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు కూడా. అయితే అన్నింటిలో అందర్నీ బాగా ఆకర్షించిన పేరు రాయపాటి సాంబశివరావు. చంద్రబాబు లిస్ట్ రిలీజ్ చేయకముందే, తను ఎంపీగా పోటీచేస్తున్నానని ఏకపక్షంగా ప్రకటించుకున్నారు రాయపాటి. దీనివెనక ఆసక్తికరమైన విషయం ఉంది.

నిజానికి నర్సారావుపేట ఎంపీ స్థానానికి రాయపాటి పేరు అనుకోలేదు చంద్రబాబు. ఆ స్థానంలో లగడపాటి రాజగోపాల్ పేరు ప్రముఖంగా వినిపించింది. రాజకీయ సన్యాసాన్ని వీడి నర్సారావుపేట ఎంపీ స్థానం నుంచి లగడపాటి మరోసారి బరిలోకి దిగుతారంటూ చంద్రబాబు అనుకూల మీడియాలో కథనాలు కూడా పుట్టుకొచ్చాయి. దీంతో రాయపాటికి కోపమొచ్చింది.

చంద్రబాబును ప్రత్యేకంగా కలిసిన రాయపాటి, తనకు లేదా తన కుమారునికి ఆ స్థానం ఇవ్వాలని కోరినట్లు.. లేకుంటే వ్యవహారాలూ అన్నీ బయటికి వస్తాయని హెచ్చరిక జారీ చేసినట్లు వార్తలు బయటికి పొక్కాయి. ఆ వెంటనే బయటకొచ్చి తనకు ఎంపీ సీటు ఓకే అయినట్టు తనకుతానుగా ప్రకటించుకున్నారు.

రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ 4వేల 54 కోట్ల రూపాయలకు పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ ను దక్కించుకుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంచనా వ్యయం ఏకంగా 5535 కోట్లకు పెరిగిపోయింది. అంటే ఒకేసారి 1500 కోట్ల రూపాయల పెంపు అన్నమాట. ఇవన్నీ చంద్రబాబుకు, టీడీపీ నేతలకు కమీషన్ల రూపంలో వెళ్లాయనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తనకు లేదా తన కొడుక్కి సీటు ఇవ్వకపోతే ఈ అవినీతి బాగోతం మొత్తం బయటపెడతానని చంద్రబాబును బెదిరించారట రాయపాటి. పైగా ఆయన ఇప్పటికే ఓసారి కేంద్ర జలవనరుల శాఖకు చంద్రబాబుపై ఫిర్యాదు కూడా చేశారు. ఈ పరిణామాలన్నీ కళ్లారా చూస్తున్న చంద్రబాబు.. తప్పనిసరి పరిస్థితుల్లో రాయపాటికి ఎంపీ టిక్కెట్ ఇచ్చారనే  వినిపిస్తున్నాయి.

కేవలం రాయపాటి మాత్రమేకాదు.. దాదాపు 6 ఎంపీ స్థానాల్లో చంద్రబాబు మాట చెల్లలేదు. ఒత్తిళ్లు, బెదిరింపులకు తలొగ్గారు. పార్టీపై బాబుకు ఉన్న పట్టు ఇది. 

చంద్రబాబు నిర్ణయాల పలితం-శక్తిమంతంగా KCR 

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?

Show comments