కాస్టింగ్ కౌచ్ పై రవితేజ రియాక్షన్

తెరపైనే కాదు, రియల్ లైఫ్ లో కూడా కాస్త వెటకారంగా ఉంటాడు రవితేజ. ఎప్పుడూ జోకులు వేస్తూ, సెటైర్లు వేస్తూ సరదాగా ఉంటాడు. తన స్టయిల్ లోనే కాస్టింగ్ కౌచ్ పై కూడా స్పందించాడు. టాలీవుడ్ తో పాటు అన్ని చిత్ర పరిశ్రమల్ని కుదిపేస్తున్న మీటూ ఉద్యమంపై రవితేజ రియాక్ట్ అవ్వడం ఇదే మొదటిసారి.

"మీటూ ప్రభావం టాలీవుడ్ పై గట్టిగా పడింది. అందరూ ఇప్పుడు కుదురుగా ఉంటున్నారు. ఇకపైన కూడా అంతా కుదురుగా ఉంటారు. ఉండాలి.. అలానే అంతా కుదురుగా ఉండాలి."

కాస్టింగ్ కౌచ్ పై రవితేజ రియాక్షన్ ఇది. మీటూ ఉద్యమం వల్ల టాలీవుడ్ లో కొందరి వ్యక్తుల ప్రవర్తనలో చాలామార్పు కనిపిస్తోందనే అర్థంవచ్చేలా మాట్లాడాడు రవితేజ. ఇకపై కూడా ఇలానే ఉండాలని, మీటూ ఉద్యమం వచ్చి మంచిపని జరిగిందని అభిప్రాయపడ్డాడు.

మీటూ ఉద్యమం వల్ల టాలీవుడ్ లో కొందరు చాలా కుదురుగా ఉంటున్నారని, ఎలాంటి పిచ్చివేషాలు వేయడం లేదని తెలిపిన రవితేజ... తనుచెప్పిన మాటలు నిజమనే విషయం మీడియా వాళ్లకు కూడా తెలుసని జోకులు వేశాడు.

మీటూ మూమెంట్ తో సినిమాలకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ మేటర్ కూడా షేర్ చేసుకున్నాడు రవితేజ. సవ్యసాచి సినిమా ఆఫర్ ముందుగా తన వద్దకొచ్చిందని తెలిపాడు. కానీ అందులో కూడా ఓ ట్విస్ట్ ఉందంటున్నాడు.

"సవ్యసాచి సినిమా డిఫరెంట్ ఎప్రోచ్ తో వచ్చింది. కంప్లీట్ వేరే సెటప్ తో వచ్చింది. కానీ ఎందుకో నాకు నచ్చలేదు. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. చందు మొండేటి తీసిన సవ్యసాచి కథ నా దగ్గరకు రాలేదు. నా దగ్గరకు వేరే కథ వచ్చింది. దాదాపు సవ్యసాచిలానే ఉంటుంది. కొన్ని కారణాల వల్ల అది టేకాఫ్ అవ్వలేదు."

తన మనసుకు నచ్చితే ఎలాంటి సినిమాలోనైనా నటిస్తానని ప్రకటించాడు రవితేజ. మైత్రీ మూవీమేకర్స్ తో 3 సినిమాలకు డీల్ సెట్ అయిందనే వార్తను ఖండించిన మాస్ రాజా.. అలాంటి డీల్స్ ఎప్పుడూ పెట్టుకోనని తెలిపాడు. 

రవితేజ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

వెనక్కి చూడకుండా పారిపో!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

Show comments