'మద్దాలి శివారెడ్డి'కి ఎంపీ టికెట్ కన్ఫర్మ్!

సినిమాల్లో రాజకీయ నేతగా నటించడంలో పండిపోయాడు రవి కిషన్. ఈ భోజ్ పురి నటుడు ప్రత్యేకించి తెలుగులో వరసగా రాజకీయ నేత పాత్రల్లో నటించాడు. వైట్ అండ్ వైట్ ధరించే పొలిటీషియన్ పాత్రల్లో రవి కిషన్ దుమ్ము రేపాడు. 'రేసుగుర్రం' సినిమాలో మద్దాలి శివారెడ్డి పాత్రలో రవి కిషన్ నటన దుమ్ము రేపిందని చెప్పనక్కర్లేదు. 

ఎన్నికల్లో పోటీ చేయడం, మంత్రి కావడం అనే తన పాత్ర స్వభావాన్ని చక్కగా చూపించాడు ఈ భోజ్ పురి సూపర్ స్టార్. ఆ సినిమాలో అలా నెగిటివ్ టచ్ ఉన్న పొలిటీషియన్ పాత్రను పండించిన రవి కిషన్ కు ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలు తగిలాయి.

తెలుగులోనే 'ఎమ్మెల్యే' సినిమాలో ఎమ్మెల్యే పాత్రను మరోసారి తనదైన శైలిలో చక్కగా పండించాడు. అలాగే 'రాధ' సినిమాలో కూడా ఇతడికి ఎమ్మెల్యే పాత్రే దక్కింది. ఇలా వరసగా ఎమ్మెల్యే, మంత్రి పాత్రలు చేసిన ఈ నటుడికి ఎంపీ టికెట్ దక్కింది.

యూపీలోని గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి రవి కిషన్ ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. బీజేపీ తరఫున ఈ నటుడికి ఎంపీ టికెట్ దక్కింది. మరి సినిమాల్లో పొలిటీషియన్ పాత్రలతో దుమ్ము రేపిన రవి కిషన్, నిజజీవితంలో కూడా చట్ట సభకు ఎన్నికవుతాడేమో చూడాలి!

Show comments