రవిబాబు మారలా..?

యాక్టర్ కమ్ డైరక్టర్ రవిబాబుది ఒక టిపికల్ స్టయిల్. ఆయన సినిమాల ప్రచారానికి ఒక కాన్సెప్ట్ అనుకుంటారు. ఇక అలాగే వెళ్తారు. ఏ సినిమా అయినా అంతే. లేటెస్ట్ గా ఆవిరి అనే సినిమా స్టార్ట్ చేసి, ఆల్ మోస్ట్ ఫినిష్ చేసారు. ఈ సినిమాకు ఆ మధ్య ఓ లుక్ వదిలారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నిర్మాత దిల్ రాజు చేతికి వచ్చిన సందర్భంగా మరో పోస్టర్ వదిలారు.

ఫస్ట్ వదిలిన దాంట్లో ఓ గాజు జాడీ, అందులోంచి బయటకు వస్తున్న ఆవిరి లాంటి పొగ, జాడీలో నృత్యం చేస్తున్న అమ్మాయి బొమ్మ. ఇప్పుడు వదిలిన పోస్టర్ లో స్టవ్ మీద కుక్కర్. బయటకు వస్తున్న ఆవిరి, కుక్కర్ లో కనిపిస్తున్న కళ్లు.

నిజానికి సినిమా మీద క్యూరియాసిటీ పెంచడానికి ఇలా చేయాలని రవిబాబు అనుకుని వుండొచ్చు. కానీ ఒకసారి కొత్త, రెండుసార్లు కొత్త. కానీ జనాలకు అలవాటు అయిపోయిన తరువాత మళ్లీ అయిడియా మార్చాలి. లేదూ అంటే ప్రతి సినిమాకు రవిబాబు ఇలాగే చూపిస్తాడు అనే ముద్ర వచ్చేస్తుంది.

సినిమా మీద రావాల్సిన ఆసక్తిరాదు. కాన్సెప్ట్ మారిస్తే చాలదు. ప్రెజెంట్ చేసే విధానం కూడా మారాలి. లేదూ అంటే రోటీన్ అయిపోయే ప్రమాదం వుంది.

ఎంత పని చేసావయ్యా సుజీత్‌!