రావణాసుర..పక్కా థ్రిల్లర్ అన్న మాట

రవితేజ‌ లేటెస్ట్ సినిమా రావణాసుర. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకుడు. ఈ సినిమా సబ్జెక్ట్ మీద ఇప్పటి వరకు సస్సెన్స్ నే. అసలు రవితేజ‌ హీరోనా? విలన్ నా? సుశాంత్ సంగతేమిటి? అసలు సినిమా జానర్ ఏమిటి? అని. దీనికి తోడు దర్శకుడు సుధీర్ వర్మ కూడా కథ రివీల్ చేయలేను, ఎక్కువగా చెప్పలేను అంటూ వస్తున్నారు. 

ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు ఉరుము లేని పిడుగులా సడెన్ గా ట్రయిలర్ వదిలేసారు. అసలే దసరా సినిమా హొరులో రావణాసుర అలికిడి వినిపించడం లేదు. దానికి తోడు సింపుల్ గా ఇలా ఆన్ లైన్ లో వదిలేసారు.

సరే, ఆ ముచ్చట అలా వుంచి ట్రయిలర్ చూస్తే మాత్రం కాస్త ఆసక్తికరంగానే వుంది. అన్ని జ‌నార్లు జాయింట్ చేసి వండిన థ్రిల్లర్ వంటకం మాదిరిగా వుంది. సీరియస్ తక్కువ అనిపించే అచ్చమైన రవితేజ‌ టైపు క్యారెక్టర్ లో రవితేజ‌ లాయర్ గా కనిపించారు. అమ్మాయిలు..లైన్లు వేసుకోవడం ఇవన్నీ మామూలే. మర్డర్లు వాటి చుట్టూ అలుముకున్న మిస్టరీ, పరిశోధన అది మెయిన్ ట్రాక్ లా కనిపిస్తోంది.

ట్రయిలర్ లో చాలా క్యారెక్టర్లు కనిపించాయి. మొత్తం మీద ట్రయిలర్ ఓ క్లారిటీ అయితే ఇచ్చింది. రవితేజ‌ మార్కు థ్రిల్లర్ ఇది అని. మరి ఈ ఫీట్ ను సుధీర్ వర్మ ఎలా చేసారో చూడాలి. ఈ సినిమాకు నిర్మాత అభిషేక్ నామా…ఏప్రియల్ 7న విడుదల. మర్డర్లు చేయడం ఓ ఆర్ట్..ఐ యామ్ యాన్ ఆర్టిస్ట్..అని రవితేఙ క్లయిమాక్స్ లో డయిలాగ్ చెప్పాడు అంటే అసలు సిసలు ట్విస్ట్ అదన్న మాట. ట్రయిలర్ లో కొసమెరపు అదే.

Show comments