పెళ్లి మాటెత్తితే....జారుకున్న‌ అందాల‌ రాశి

అక్కినేని, ద‌గ్గుబాటి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న "వెంకీ మామ" సినిమా శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో విక్ట‌రీ వెంక‌టేష్‌, పాయ‌ల్‌రాజ్‌పుత్ జంట‌తో పాటు నాగ‌చైత‌న్య, అందాల ముద్దుగుమ్మ రాశీఖ‌న్నా జంట‌గా న‌టిస్తున్నారు.

ఈ చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా రాశీ సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అభిప్రాయాల‌ను నెటిజ‌న్ల‌తో పంచుకున్నారు.మ‌హేశ్‌బాబు గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఏ మాత్రం త‌డుముకోకుండా సూప‌ర్‌స్టార్ అని చెప్పారు. అంతేకాదు ఏ సినిమాను ఎక్కువ సార్లు థియేట‌ర్లో చూశారు, ఎన్ని చూశార‌నే ప్ర‌శ్న‌కు తాను న‌టించిన తొలిప్రేమ సినిమాను ఐదుసార్లు చూసిన‌ట్టు ఆమె చెప్పారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి చెప్ప‌మంటే ఆయ‌నో అసాధార‌ణ వ్య‌క్తి అని త‌న‌దైన స్టైల్‌లో అభిప్రాయం చెప్పారామె.వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య‌, నాని, ప్ర‌భాస్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌...ఇలా అంద‌రి గురించి త‌న మ‌స‌నులోని అభిప్రాయాల‌ను పంచుకున్నారామె. అంతేకాదు ప‌వ‌న్‌క‌ల్యాణ్ గురించి చెప్ప‌మంటే ఆయ‌న గురించి చెప్ప‌డానికి మాట‌లు స‌రిపోవ‌ని, ఆయ‌నో లెజెండ్ అని ఎంతో అల్ల‌రిగా చెప్పారామె.

అయితే ఆమె ఒకే ఒక్క ప్ర‌శ్న‌కు మాత్రం మ‌న‌సు విప్ప‌లేదు. టీ, కాఫీ, ఇష్ట‌మైన ప్ర‌దేశాలు త‌దిత‌ర అంశాల గురించి జ‌వాబిచ్చిన రాశీ...ఇంత‌కూ మీరు ఎవ‌ర్ని పెళ్లి చేసుకుంటారంటే మాత్రం సిగ్గుప‌డుతున్నారామె. ఊహూ, ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌దంటూ మెల్ల‌గా జారుకున్నారా అందాల రాశి.ఆడ‌వాళ్ల వ‌య‌స్సు, మ‌గ‌వారి వేత‌నం గురించి అడ‌గొద్ద‌ని పెద్ద‌లు చెబుతారు. మ‌న అందాల రాశి మాత్రం అదొక్క‌టి అడ‌గొద్దు ఫ్లీజ్ అంటోంది.

Show comments