రష్మికకు మరో మంచి చాన్స్?

రష్మిక మడొన్నా.. లక్కీ హీరోయిన్ గా వుంది తెలుగునాటం. ఛలో, గీతగోవిందం ఆమె ఖాతాలో వున్న హిట్ లు. దేవదాస్ కూడా ఫరవాలేదు. విజయ్ దేవరకొండతోనే మరో సినిమా డియర్ కామ్రేడ్ చేస్తోంది రష్మిక. నితిన్ పక్కన వెంకీ కుడుముల డైరక్షన్ లో భీష్మ సినిమా చేయాల్సి వుంది ఆమె. మరో అవకాశం కూడా ఆమెకు వచ్చేలా కనిపిస్తోంది.

సాయిధరమ్ తేజ్ సరసన చేయడానికి ఆమెకు అవకాశం, డేట్ లు వున్నాయేమో అన్న ఎంక్వయిరీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి డిటైల్స్ ఇంకా బయటకురాలేదు. కానీ రష్మిక డేట్ ల కోసం ప్రయత్నాలు మాత్రం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టు ఓకె అయితే సాయిధరమ్-రష్మిక కాంబినేషన్ చూడొచ్చు. కచ్చితంగా డిఫరెంట్ గా వుంటుంది. రష్మిక అదృష్టం సాయిధరమ్ కు కూడా కాస్త అంటే అవకాశం వుంటుంది.

నా నోరు మూయించాలని చూశారు : వీరమాచినేని

పబ్లిక్ పల్స్ : ఆ నియోజకవర్గంలో జనసేనపై ఏమనుకుంటున్నారు..

Show comments