జగన్ దేవుడిలాండి వారు: జనసేన ఎమ్మెల్యే

ఒకవైపు తమ పవన్ కల్యాణ్ దేవుడని అంటూ ఉంటారు ఆయన వీరాభిమానులు. కొన్నేళ్ల కిందటే పవన్ ను వారు దేవుడిని చేశారు. అయితే జనాలు మాత్రం పవన్ కల్యాణ్ ను ఎమ్మెల్యేగా కూడా చేయలేదు. ఆ సంగతలా ఉంటే.. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీలో ఆసక్తిదాయకమైన ప్రసంగం చేశారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు జనసేన ఎమ్మెల్యే. బడ్జెట్ లో 
పేర్కొన్న వివిధ సంక్షేమ పథకాలను ఆయన అభినందించారు.

జగన్ మోహన్ రెడ్డిపై రైతులు, సామాన్యులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చేలా బడ్జెట్ ఉందని రాపాక అన్నారు. రైతులకు బడ్జెట్ లో పెద్ద పీట వేశారని, ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందించాలని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయాన్ని పండగ చేశారన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఏడు లక్షల రూపాయల మొత్తాన్ని పరిహారంగా ఇవ్వడం గొప్ప విషయమన్నారు.

జాలర్ల కుటుంబాలకు ఈ బడ్జెట్ తో అమలయ్యే సంక్షేమ పథకాలూ చాలా బాగున్నాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లి ప్రమాదానికి గురి అయితే వారికి పరిహారం ఇవ్వడం అభినందనీయం అన్నారు. మత్స్యకారులకు గంగమ్మ కోర్కెలు తీర్చే దేవత అయితే, కోరకుండానే ఆదుకుంటున్న దేవుడిలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని రాపాక వరప్రసాద్ అన్నారు.

మళ్ళీ ఆత్మగౌరవం నినాదం.. మారానని ప్రచారం

Advertising
Advertising